Home   »  రాజకీయం   »   Green Telangana |కేసీఆర్ తోనే పచ్చని తెలంగాణ

Green Telangana |కేసీఆర్ తోనే పచ్చని తెలంగాణ

schedule mounika

సీఎం KCR తోనే పచ్చని తెలంగాణ(Green Telangana) అని, పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని ఎమ్మెల్యే రవి శంకర్ అన్నారు.

చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం సభ్యులు ఎమ్మెల్యే రవిశంకర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రవి శంకర్ మాట్లాడుతూ…. తెలంగాణ అభివృద్ధి KCR తోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.

KCR తోనే పచ్చని తెలంగాణ(Green Telangana)

సీఎం కేసీఆర్(KCR) తోనే పచ్చని తెలంగాణ(Green Telangana) అని ,అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చిపోయే నాయకుడిని కాదు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. ఏ కష్టం వచ్చినా మీకు తోడుగా నిలుస్తా…. చావు నోట్లో తలపెట్టి బరిగీసి కొట్లాడి KCR తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమ పథకం. సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశానికి అన్నం పెట్టె రైతన్న ఏ కారణం చేత చనిపోయిన 15 రోజులలో ఐదు లక్షల ప్రమాద బీమా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.

ఆడబిడ్డకు పెళ్లయితే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లక్ష 116 రూపాయల మేనమామ కట్నంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో 9 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది అన్నారు.