Home   »  ఆంధ్రప్రదేశ్   »   Lakkasagaram: కర్నూల్ లక్కసాగరంలో పంప్‌హౌస్‌ ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

Lakkasagaram: కర్నూల్ లక్కసాగరంలో పంప్‌హౌస్‌ ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

schedule raju

Lakkasagaram: నేడు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం వద్ద 224.31 కోట్ల వ్యయంతో 10 వేల ఎకరాలకు పైగా సాగునీటిని అందించే పంప్‌హౌస్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ప్రారంభించారు. ఇందులో భాగంగా నేడు కర్నూలు జిల్లా లక్కసాగరంలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు.

Lakkasagaram పంప్‌హౌస్‌

డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు హంద్రీ-నీవా నీటిని తరలించి దాహార్తిని తీర్చే ఉద్దేశంతో కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్క సాగరం వద్ద 224.31 కోట్లతో నిర్మించిన లిఫ్ట్‌ పథకాన్ని సీఎం జగన్‌ (YS Jagan) ప్రారంభించారు.

Also Read: Jagan: శాంతిభద్రతలపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల జిల్లా డోన్‌లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ (YS Jagan) ప్రసంగించనున్నారు. కాగా, లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ప్రారంభోత్సవం వల్ల డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని చెరువులకు నీరు అందనుంది. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు, సాగునీరు అందిస్తామన్నారు. 10,394 ఎకరాలకు సాగునీరు అందనుంది అని తెలియజేసారు.

ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి (YS Jagan) జిల్లా కలెక్టర్‌ సృజన, రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరాం, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, సుధాకర్‌, హఫీజ్‌ఖాన్‌, కాటసాని రాంభూపాలరెడ్డి, తొగూరు ఆర్థర్‌, తదితరులు స్వాగతం పలికారు.