Home   »  వినోదం   »   Sharwa35: శర్వానంద్‌తో కృతి శెట్టి… పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్.!

Sharwa35: శర్వానంద్‌తో కృతి శెట్టి… పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్.!

schedule raju

Sharwa35: తన తొలి చిత్రం ‘ఉప్పెన’ తర్వాత విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా, శర్వానంద్ (Sharwanand) హీరోగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంయుక్తంగా శర్వానంద్ 35వ సినిమాను రూపొందిస్తున్నాయి. శర్వా35 (Sharwa35) చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. గురువారం, ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘ఉప్పెన’ బ్యూటీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

Sharwa35 కృతి శెట్టి ఫస్ట్‌లుక్‌

పాక్షికంగా లండన్‌లో సెట్ చేయబడిన శర్వా35 చిత్రంలో ‘కస్టడీ’ హీరోయిన్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని మేకర్స్ తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక ప్రత్యేక వీడియో మరియు అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేసింది.

Also Read: Chandramukhi 2: ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న రిలీజ్‌…

అక్టోబర్‌లో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ తర్వాత టీజర్‌ను విడుదల చేయనున్నారు. దింతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా మొదలవుతుంది.

నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మరియు సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల హేషమ్ అబ్దుల్ వహాబ్ (ఇటీవలి ‘కుషి’ ఫేమ్ సంగీత దర్శకుడు) మరియు విష్ణు శర్మ (సినిమాటోగ్రాఫర్)లను తీసుకున్నారు. ప్రవీణ్ పూడి ఎడిట్ చేసిన ఈ చిత్రానికి జానీ షేక్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.