Home   »  జాతీయం   »   Supreme Court |సుప్రీంకోర్టులో కర్ణాటకకు ఎదురు దెబ్బ

Supreme Court |సుప్రీంకోర్టులో కర్ణాటకకు ఎదురు దెబ్బ

schedule mahesh

NEWDELHI : తమిళనాడుకు రోజుకు 5,000 క్యూసెక్కుల కావేరీ నీటిని కేటాయించాలని తమిళనాడు Supreme Court లో దాఖలు చేసిన దరఖాస్తును స్వీకరించిన జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇలా పేర్కొంది.

ఈ నెల 13 నుండి 28 వరకు తమిళనాడు రాష్ట్రానికి 5,000 క్యూసెక్కుల నీటిని కేటాయించాలన్న కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ అథారిటీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు ఆమోదించింది.

నిపుణుల కమిటీ నిర్ణయం ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నీటి విడుదలకు సంబంధించి కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు కర్ణాటకకు సూచించింది.

బీఆర్ గవాయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడం కుదరదని కర్ణాటక సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది.

కొత్త రిజర్వాయర్ కోసం కర్ణాటక చేసిన విజ్ఞప్తి పై నోరు మెదపని Supreme Court

కావేరీ నది నుండి నీటిని పొందే విషయంలో కర్ణాటక రాష్ట్రానికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని నీటి నిల్వ కోసం మరో రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని కర్ణాటక చేసిన ప్రతిపాదన దరఖాస్తు పై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేస్తే కర్ణాటక రాష్ట్రంలోని కావేరీ పరివాహక ప్రాంత ప్రజలకు
తీవ్ర తాగునీటి సమస్య ఎదురౌతుందని ఈ పరిస్థితిని అధిగమించాలంటే కర్ణాటక కి 106 టీఎంసీల నీరు కావాలి.

కానీ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో కర్ణాటక డ్యాముల్లో నీరు చాలా తక్కువగా ఉందని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.

విచారించిన సుప్రీం కోర్టు తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 రోజుల పాటు రోజూ 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.