Home   »  తెలంగాణ   »   Jalpally | జలపల్లి లో వీధి కుక్కల బెడద…

Jalpally | జలపల్లి లో వీధి కుక్కల బెడద…

schedule sirisha

హైదరాబాద్: ‘జాతి జంతు సంరక్షణ కేంద్రం’ లేని జలపల్లి (Jalpally) మున్సిపాలిటీ వీధికుక్కల బెడదతో వణికిపోతుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)కి సమీపంలో ఉన్న ఈ మున్సిపాలిటీలోని అభివృద్ధి చెందని ప్రాంతాలలో నివసిస్తున్న నివాసితులు వీధికుక్కల గురించి ఆందోళన చెందుతూ కుక్కల దాడుల గురించి ఫిర్యాదులు చేసారు.

జలపల్లి (Jalpally) నివాసితులు బాధ :-

జలపల్లి లోని నివాసి మొహమ్మద్ జాఫర్, ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళలు భయాందోళనకు గురవుతున్నట్లు,ఈ ప్రాంతం చుట్టు కుక్కల సమూహాలు తిరుగుతున్నాయని ఫిర్యాదులో తెలిపారు.

దీనిపై స్థానిక మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. స్థానిక ప్రాంతాల్లో పెద్దపెద్ద చెత్త కుప్పలు పేరుకుపోయి, మిగిలిపోయిన ఆహార పదార్థాల వల్ల కుక్కలు ఆకర్షితులవుతున్నాయని జాఫర్ తెలిపారు. ఇక్కడ సరైన చెత్త సేకరణ యంత్రాంగాలు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

మరో నివాసి గౌస్ పాషా మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి వీధి కుక్క కాటు కేసులు ఘననీయంగా పెరిగాయని, షాహీన్ నగర్, బిస్మిల్లా కాలనీ, ఉస్మాన్ నగర్, సాదత్ నగర్ తదితర ప్రాంతాల్లో కుక్కల దాడులు చర్చనీయాంశంగా మారాయి.

రాత్రి వేళల్లో కుక్కలు కాలనీల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్కోసారి వాహనదారులను వీధికుక్కలు గుంపులుగా వెంబడిస్తున్నాయని కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని స్థానికులు నిర్నయిన్చుకున్నట్లు తెలిపారు.