Home   »  జాతీయం   »   CM Yogi |ప్రతి జిల్లాకు ఒక మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉండాలి

CM Yogi |ప్రతి జిల్లాకు ఒక మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉండాలి

schedule mahesh

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లోని మహిళా పోలీస్ స్టేషన్ కి అధిపతి కాకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉండాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi)  ఆదేశించారు.

మహిళా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌లకు అర్హత కలిగిన, కష్టపడి పనిచేసే పోలీసు సిబ్బందిని నియమించాలని రాష్ట్రంలోని పోలీసు సూపరింటెండెంట్‌లు, పోలీసు కమిషనర్‌లు వీలైనంత త్వరగా ఈ ఉత్తర్వూలని అమలు అయ్యేలా చూడాలని నిన్న సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదేశాలు జారీ చేసారు.

UPలో నవరాత్రి ఉత్సవ (దసరా) ప్రారంభం నుండి కొత్తగా ‘మిషన్ శక్తి’ని ప్రారంభిస్తామన్న CM Yogi

సీఎం సమీక్ష సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లు, సర్కిల్‌లు, రేంజ్‌లు, జోన్‌లలో వున్న పోలీసు అధికారులతో సీఎం మాట్లాడారు. రానున్న శరన్ నవరాత్రి ఉత్సవ (దసరా) ప్రారంభం నుండి రాష్ట్రంలో కొత్తగా ‘మిషన్ శక్తి’ని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక మహిళను ‘శక్తి దీదీ’గా నియమించి మహిళలకు సాధికారత కల్పించాలని నిర్ణయించింది.

మహిళల కోసం 108, 1090, 181 వంటి హెల్ప్‌లైన్ నంబర్‌ల ఏర్పాటు చేసిన సీఎం

వారానికి ఒకసారి ఇద్దరు మహిళా పోలీసు సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆగ్జిలరీ నర్సు మిడ్‌వైఫ్‌లు, బిసి సఖీలు, రోజ్‌గార్ సేవక్‌లు, ఒక గ్రామ పంచాయతీలోని మహిళలతో వారి హక్కులు , రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకున్న చర్యల పై వారికి అవగాహన కల్పిస్తారు.

మహిళల భద్రత వారు వివిధ కార్యక్రమాల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. 108, 1090, 181 వంటి హెల్ప్‌లైన్ నంబర్‌ల గురించి మహిళలకు తెలియజేయాలి. రాష్ట్రంలో అర్హులైన మహిళలకు పింఛను, ‘కన్యా సుమంగళ’, ‘మాతృత్వ వందన యోజన’ వంటి ప్రజా సంక్షేమ పథకాలను ఈ మిషన్ శక్తి పరిధిలోకి తీసుకు రావాలని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రభుత్వం అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిళ్లు, రేంజ్‌లు, జోన్‌ల పని తీరును పర్యవేక్షిస్తోందన్న CM Yogi

రాష్ట్ర ప్రభుత్వం అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిళ్లు, రేంజ్‌లు, జోన్‌ల పని తీరును పర్యవేక్షిస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏదైనా ఆటంకాలు లేదా అన్యాయం జరిగితే సంబంధిత
సంబంధిత పోలీస్ అధికారిని సస్పెండ్ చేస్తామని సీఎం తెలిపారు.

అవినీతి అధికారులను పోలీస్ స్టేషన్‌లకి లేదా పోలీసు సర్కిల్‌లకు ఇన్‌చార్జ్‌లుగా నియమించకుండా పోలీసు సూపరింటెండెంట్, పోలీసు కమిషనర్లు చూసుకోవాలని సీఎం తెలిపారు.

మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశం

మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఇచ్చిన స్పష్టమైన సందేశంలో ఆదిత్యనాథ్ అన్నారు.

ప్రజా ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని అధికారులు తెలుసుకోవాలి. పెట్రోలింగ్‌ను
మరింత పెంచాలి, వారు ఏ సంఘటనను చిన్నదిగా చూడకూడదని ముఖ్యమంత్రి అన్నారు.

రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, పర్యాటకుల భద్రత, సౌకర్యాల పై పోలీసు సిబ్బంది పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ రైల్వే పోలీసు, ఇతర ముఖ్యమైన పోలీసు విభాగాలతో పాటు సరిహద్దు పోలీసు స్టేషన్‌లలో అర్హత కలిగిన పోలీసు సిబ్బందిని నియమించాలని ఆదిత్యనాథ్ తెలిపారు.