Home   »  జాతీయం   »   Punjab |కాంగ్రెస్‌తో టచ్‌లో 32 మంది ఆప్ ఎమ్మెల్యేలు…!

Punjab |కాంగ్రెస్‌తో టచ్‌లో 32 మంది ఆప్ ఎమ్మెల్యేలు…!

schedule mahesh

Panjab : ఇండియా కూటమిలో చీలికలకు సంకేతంగా, పంజాబ్ (Punjab) లోని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు, శాసనసభ్యుడు పర్తాప్ సింగ్ బజ్వా 32 మంది అధికార పార్టీ ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

దీని పై పంజాబ్ (Punjab) ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ ) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ రోజు బజ్వా పై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 18 సీట్లు ఉన్నాయని 32 మంది ఆప్ ఎమ్మెల్యేల మద్దతుతో తమ పార్టీ పాలక ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టగలదని మాన్ ప్రశ్నించారు.

భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ రాఘవ్ ఛద్ద, పరిణితి చోప్రా వివాహ వేడుకల కోసం ఉదయపూర్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బజ్వా యొక్క వాదనలపై X ట్విట్టర్లో బజ్వాను బిజెపి అనుబంధ నాయకుడుగా విమర్శల వర్షం కురిపించారు.

మీరు పంజాబ్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడం గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కావాలనే మీ కోరికను కాంగ్రెస్ చంపేసిందని నాకు తెలుసు.

నేను పంజాబ్‌లోని మూడు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిని, మీకు దమ్ముంటే హైకమాండ్‌తో మాట్లాడండి. అని భగవంత్ మన్‌ స్పందించారు.

2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 117 స్థానాలకు గానూ 92 స్థానాలను గెలుచుకుని విజయం సాధించింది.