Home   »  తెలంగాణ   »   Milad Un Nabi | జియాగూడ మిలాద్ ఉమ్ నబీ ర్యాలీలో ‘జై శ్రీరామ్’ నినాదాలతో ఉద్రిక్తత

Milad Un Nabi | జియాగూడ మిలాద్ ఉమ్ నబీ ర్యాలీలో ‘జై శ్రీరామ్’ నినాదాలతో ఉద్రిక్తత

schedule sirisha

హైదరాబాద్: హైదరాబాద్‌లో అక్టోబర్ 1 ఆదివారం జియాగూడ, హుస్సేనాలంలో జరిగిన మిలాద్ ఉన్ నబీ (Milad Un Nabi) ఊరేగింపు సందర్భంగా వేర్వేరు ఘటనలపై రెండు కేసులను నమోదు చేసారు.

జియాగూడలో మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు జరుగుతుండగా జై శ్రీరామ్ నినాదాలు చేసినందుకు గాను పలువురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్, కుల్సుంపురా పోలీసుల బృందాలు గుర్తించి యువకుల ఇళ్లపై దాడులు చేసి అరెస్ట్ చేశారు.

మిలాద్‌ ఉన్‌ నబీ (Milad Un Nabi) వేడుకలు

ఆదివారం హైదరాబాద్‌లోని జియాగూడలో మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకల సందర్భంగా మిలాద్‌ ఊరేగింపులో పాల్గొన్న వారిపై కొందరు వ్యక్తులు ఎదురుకాల్పులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. మరో వర్గానికి చెందిన యువకులు గుమిగూడి ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడంతో అల్లరులు నెలకొన్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుల్సుంపురా పోలీసులు సమస్య సృష్టించినందుకు కనీసం ఆరుగురిపై కేసు నమోదు చేసుకొని కఠినమైన చర్యలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

జియాగూడలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ జరుగుతుండగా హిందూ, ముస్లింల రెండు గ్రూపులు మతపరమైన నినాదాలు చేయడం వల్ల గొడవలకు దారి తీసింది.

మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీలో ఏం జరిగిందంటే

మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం కొందరు యువకులు బైక్ ర్యాలీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కుల్సుంపురా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసి ద్విచక్ర వాహనాలను రోడ్డుపై నిలిపి జెండాలు ఊపుతూ ర్యాలీ చేస్తుండగా కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు.

కాగా కొద్దిసేపటికే మరో కొందరు యువకులు గుమిగూడి ‘జై శ్రీరాం’ అంటూ బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు. వారు చేతిలో కాషాయ జెండాలతో టిఫిన్ సెంటర్ దగ్గర సమావేశం అయినారు. అయితే చివరకు ముస్లిం యువకులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు.

ర్యాలీని నిర్వహించిన బృందంపై కేసు

హుస్సేనియాలం విషయానికొస్తే గొల్ల ఖిడ్ఖీ వద్ద ఆలయం వెలుపల ఉంచిన పూల కుండను ధ్వంసం చేశారంటూ మిలాద్ ఉన్ నబీ ర్యాలీని నిర్వహించిన బృందంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంఘటనా స్థలంలో గుంపు గుమిగూడినప్పటికీ స్థానిక పోలీసులు లాటి ఛార్జ్ చేసి చెదర గొట్టారు. పోలీసులు సరైన భద్రత కల్పించలేదని పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని స్థానికులు పేర్కొన్నారు.