Home   »  తెలంగాణ   »   Cable Bridge |అక్టోబర్ 4న కేబుల్ బ్రిడ్జి పై వాహనాల నిషేధం

Cable Bridge |అక్టోబర్ 4న కేబుల్ బ్రిడ్జి పై వాహనాల నిషేధం

schedule sirisha

హైదరాబాద్‌: భారత ఎన్నికల సంఘం తన ‘సైక్లింగ్ టు ఓట్ అండ్ వాకథాన్’ అవగాహన కార్యక్రమాన్ని అక్టోబర్ 4న సాయంత్రం 5.30 నుండి 8.30 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) వద్ద నిర్వహించనుంది.

కేబుల్ బ్రిడ్జి (Cable Bridge)పై ‘సైక్లింగ్ టు ఓట్ అండ్ వాకథాన్’ ఈవెంట్

ఈవెంట్ బ్రిడ్జిపై ప్రారంభమై ఇనార్బిట్ మాల్, మై హోమ్ అబ్రా, ఐటీసీ కోహెనూర్ దాటి బ్రిడ్జికి తిరిగి వస్తారు. ఆ సమయంలో వంతెనపై సాధారణ రాకపోకలు నిలిపి వేయబడతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

రోడ్ నెం. 45 నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను కావూరి హిల్స్ వద్ద మాదాపూర్ L&O PS ఎడమ మలుపు మీదుగా మళ్ళించ బడుతుందని తెలిపారు. బయో డైవర్సిటీ జంక్షన్ నుండి కేబుల్ బ్రిడ్జ్ వైపు వచ్చే ట్రాఫిక్ సైబర్ టవర్స్ వైపు మళ్లించ బడుతాయి.

కేబుల్ బ్రిడ్జి మరియు డౌన్ ర్యాంపులు మూసివేత

మీనాక్షి జంక్షన్ నుండి కేబుల్ బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను IKEA రోటరీ, సైబర్ టవర్స్ వద్ద మళ్లిస్తారు. కేబుల్ బ్రిడ్జి మరియు డౌన్ ర్యాంపులు మూసివేసి, రోడ్ నంబర్ 45 నుండి వచ్చే ట్రాఫిక్‌ను మాదాపూర్ ఎల్‌అండ్‌ఓ పిఎస్ వైపు మళ్లించనున్నట్లు తెలిపారు.

బ్రిడ్జ్ వైపు ట్రాఫిక్ ని జూబ్లీ హిల్స్ వైపు మళ్లింపు

బయో డైవర్సిటీ పార్క్ జంక్షన్ నుండి కేబుల్ బ్రిడ్జ్ వైపు ట్రాఫిక్ సైబర్ టవర్స్, COD, రోడ్ నెం. 45 జూబ్లీ హిల్స్ వైపు మళ్లించబడుతుంది. మీనాక్షి జంక్షన్ నుండి కేబుల్ బ్రిడ్జి వైపు వచ్చే ట్రాఫిక్ IKEA రోటరీ – లెఫ్ట్ టర్న్ – సైబర్ టవర్స్ – COD – రోడ్ నంబర్ 45 నుండి మళ్లిస్తారు.

COD నుండి దుర్గం చెరువు మార్గం, ITC కోహినూర్ నుండి IKEA రోటరీ వరకు భారీ వాహనాలను అనుమతించబడవు. ఐటీసీ కోహినూర్‌ ఉదయం 5.30 నుంచి 8.30 గంటల మధ్య ట్రాఫిక్‌ పోలీసులు సూచనలను పాటించాలని ప్రజలకు తెలిపారు.