Home   »  జాతీయం   »   Newsclick |న్యూస్‌క్లిక్ ఫై దాడులని చేపలు పట్టే యాత్రగా వర్ణించిన ముఫ్తీ

Newsclick |న్యూస్‌క్లిక్ ఫై దాడులని చేపలు పట్టే యాత్రగా వర్ణించిన ముఫ్తీ

schedule mahesh

జమ్మూ &కాశ్మిర్ : న్యూస్‌క్లిక్ (Newsclick) జర్నలిస్టుల ఇళ్ల పై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ చేసిన దాడులను పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ “చేపలు పట్టే” యాత్రగా అభివర్ణించారు.

స్వతంత్ర మీడియా సంస్థలను అణిచివేతకు గురిచేస్తున్న కేంద్రం (Newsclick)

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విదేశాలలో ప్రెస్‌ పై విజయం సాధించిందని, స్వదేశంలో దాడి చేస్తుందని ఆమె ఆరోపించారు. స్వదేశంలో మిగిలిన వున్నా స్వతంత్ర మీడియా సంస్థల పై అణిచివేతకు రాష్ట్ర ఏజెన్సీలను ఉపయోగిస్తుందని ఆరోపించారు.

టెలిఫోన్ పరికరాలు కూడా ఫిషింగ్ యాత్ర కోసం మాత్రమే బలవంతంగా లాక్కోబడ్డాయి. మొదట అరెస్టు చేయడం, తరువాత నకిలీ అభియోగాలను సృష్టించడం అనే చట్టవిరుద్ధమైన విధానం కలవరపెడుతుందని ముఫ్తీ ట్విట్టర్ ఎక్స్‌ పోస్ట్‌లో రాశారు.

న్యూస్ క్లిక్ పోర్టల్‌కు చైనా నుండి నిధులు

ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ వ్యవహారం మరోసారి తెర పైకి వచ్చింది. ఈ న్యూస్‌ పోర్టల్‌కు చైనా నుండి నిధులు అందుతున్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌తో సహా ఏకకాలంలో దాదాపు 30 ప్రదేశాల్లో తనిఖీలు

ఈ రోజు ఉదయం ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ అధికారులు స్థానికంగా ఉన్న న్యూస్‌క్లిక్‌ కార్యాలయంతో పాటు ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టుల ఇళ్లలో దాడులు చేపట్టారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌తో సహా ఏకకాలంలో దాదాపు 30 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకునట్టు తెలుస్తుంది.

కొంత మంది జర్నలిస్టులు దీని పై స్పందిస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారని వారు పేర్కొన్నారు. న్యూస్‌క్లిక్‌ లోని జర్నలిస్టుల్లో ఒకరైన అభిసార్ శర్మ ఢిల్లీ పోలీసులు తన ఇంటికి వచ్చారని, తన ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం మీడియా న్యూస్‌క్లిక్‌కు విదేశాల నుండి భారీగా నిధులు సమకూర్చినట్లు ED విచారణలో తేలింది.