Home   »  ఆంధ్రప్రదేశ్   »   ముగిసిన ఢిల్లీ పర్యటన… తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకున్న జగన్

ముగిసిన ఢిల్లీ పర్యటన… తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకున్న జగన్

schedule raju

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) ఢిల్లీ పర్యటన ముగిసింది. గురువారం ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ పర్యటన అనంతరం ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగి వచ్చారు. శుక్రవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద బాధిత రాష్ట్రాల సమావేశానికి హాజరుకావడంతో పాటు, ఏపీకి సంబంధించిన వ్యవహారాలపై పలువురు కేంద్ర మంత్రులతో చర్చించారు.

పలువురు కేంద్ర మంత్రులతో జగన్ (Jagan) చర్చ

ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలు, పోలవరం, పలు సమస్యలను సీఎం జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. జగన్ (Jagan) తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో భేటీ అయ్యారు, అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ (R. K. Singh)ను కలిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆర్కే సింగ్ (R. K. Singh) ఏపీ విద్యుత్ రంగం అభివృద్ధిని కొనియాడారు. ఇక నిన్న (శుక్రవారం) ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో ఏపీ నుంచి సీఎం జగన్, సీఎస్, డీజీపీ పాల్గొన్నారు.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై కేంద్రం ఫీడ్ బ్యాక్

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై రాష్ట్రాల నుంచి కేంద్రం ఫీడ్ బ్యాక్ తీసుకుంది. అక్కడి అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ సదస్సు అనంతరం నిన్న సాయంత్రం దాదాపు గంటపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలు సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read: రాష్ట్రంలో స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నాం… సీఎం జగన్