హైదరాబాద్: కూకట్పల్లి (Kukatpally) మెట్రో స్టేషన్ సమీపంలోని ఫర్నీచర్ షోరూం భవనంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఫర్నీచర్ షోరూమ్ మొత్తం దగ్ధమైందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలను గమనించిన బాటసారులు అగ్నిమాపక శాఖ వారికీ, పోలీసులకు తెలిపారు.
వెంటనే కూకట్పల్లి, జీడిమెట్ల, సనత్‌నగర్, మాదాపూర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.