Home   »  జాతీయం   »   కుల గణన సర్వే సమాజాన్ని విభజించదంటున్న సిద్ధరామయ్య

కుల గణన సర్వే సమాజాన్ని విభజించదంటున్న సిద్ధరామయ్య

schedule mahesh

కర్ణాటక : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుల గణన సర్వే (Caste Survey) సమాజాన్ని విభజించదన్నరు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 76 ఏళ్ల తర్వాత కులం, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు.

మనది కుల ఆధారిత సమాజం, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సమానత్వం లేని కులాలను ప్రధాన జన స్రవంతిలోకి తీసుకురావడానికి గణాంకాలు చాల ముఖ్యమైనవన్నారు. ఇందుకోసం కుల గణన అవసరమని ఆయన విలేకరులతో అన్నారు.

కుల గణన సర్వే అవసరమన్న సిద్ధరామయ్య (Caste Survey)

సమాజాన్ని విభజించకుండా సామాజిక, ఆర్థిక సర్వేలు చేయాలని ఆయన అన్నారు. సిద్దరామయ్య మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి హెచ్.డి. కాంతరాజు వెనుకబడిన తరగతుల కమిషన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుల నివేదికను JDS పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి అంగీకరించలేదన్నారు.

రాష్ట్రంలో హామీ పథకాలకు ఆర్థిక కొరత ఉందన్న CM

ఇప్పుడు ఆ కమిషన్ మరొక వ్యక్తి నేతృత్వంలో ఉంది, అసలు జనాభా గణన నివేదికను సమర్పించమని నేను అతనిని కోరానని తెలిపారు. అతను నవంబర్‌లో నివేదిక అందజేస్తానని చెప్పారన్నారు. కర్ణాటక రాష్ట్రంలో హామీ పథకాలకు ఆర్థిక కొరత ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

కరువు సాయం కోసం 4,860 కోట్లు కేంద్రన్ని కోరమన్న CM

కరువు సాయం కోసం 4,860 కోట్లు కేంద్ర ప్రభుత్వంని కోరామన్నరు. రాష్ట్రంలో 42 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని మొత్తం నష్టం రూ.30,000 కోట్లు జరిగిందన్నారు. కరవును అంచనా వేయడానికి మూడు కేంద్ర బృందాలు రాష్ట్రంలోని 11 జిల్లాలను సందర్శిస్తున్నాయని సీఎం తెలిపారు. వారి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని అన్నారు. మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం కేసులు పెట్టడం సరైన చర్య కాదన్నారు.