Home   »  జాతీయం   »   బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు ప్రకటించిన RBI

బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు ప్రకటించిన RBI

schedule raju

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన గమనిక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల (Bank Holidays) జాబితాను ప్రకటించింది. అదనంగా, ఈ నవంబర్‌లో 12 రోజుల సెలవులున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ పనుల కోసం తిరిగే వాళ్లు ఈ జాబితాను తప్పనిసరిగా అనుసరించాలి. లేకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

RBI బ్యాంక్ సెలవుల (Bank Holidays) జాబితాను ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగానే నవంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ మొత్తం సెలవుల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా కలిసి ఉన్నాయి. మరి.. నవంబర్ నెలలో బ్యాంకులకు ఏయే రోజులు సెలవులు ఉంటాయో తెలుసుకుందాం..?

నవంబర్ నెల బ్యాంక్ సెలవుల (Bank Holidays) జాబితా

నవంబర్ 1 – బుధవారం (కరక చతుర్థి. ఈ రోజును జరుపుకోవడానికి భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.)
నవంబర్ 5 – ఆదివారం
నవంబర్ 10 – శుక్రవారం (వంగ పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకు సెలవు)
నవంబర్ 11 – రెండవ శనివారం
నవంబర్ 12 – ఆదివారం (దీపావళి కూడా)
నవంబర్ 13 – సోమవారం, గోవర్ధన్ పూజ (ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఢిల్లీలో బ్యాంకు సెలవు)
నవంబర్ 15 – బుధవారం, భాయ్ దూజ్ (భగినీ హస్త భోజనం) (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)
నవంబర్ 19 – ఆదివారం
నవంబర్ 24 – శుక్రవారం, లచిత్ దివాస్ (అస్సాంలో బ్యాంకు సెలవు)
నవంబర్ 25 – నాల్గవ శనివారం
నవంబర్ 26 – ఆదివారం
నవంబర్ 27 – సోమవారం, గురునానక్ పుట్టినరోజు (పంజాబ్, చండీగఢ్‌లో బ్యాంకు సెలవు)

Also Read: 2,000 నోట్లలో 76% బ్యాంకులకు తిరిగి వచ్చాయి.