Home   »  క్రీడలు   »   రేపే దాయాదుల పోరు…ఈ పోరుకు సర్వం సిద్ధం

రేపే దాయాదుల పోరు…ఈ పోరుకు సర్వం సిద్ధం

schedule mahesh

ప్రపంచ కప్‌: ప్రపంచ కప్‌ కోసం ఏడేండ్ల తర్వాత భారత గడ్డపై పాకిస్థాన్‌ జట్టు అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో మ్యాచ్ తర్వాత పాకిస్థాన్‌ జట్టు అహ్మదాబాద్‌ చేరుకుంది.

అహ్మదాబాద్‌కు చేరుకున్న ఇరుజట్లు

భారత జట్టుతో రేపటి మ్యాచ్‌ కోసం పాకిస్థాన్ జట్టు అహ్మదాబాద్‌ చేరుకోవటం జరిగింది. విమానాశ్రయం నుంచి టీమ్‌ హోటల్‌కు వెళ్లిన పాక్‌ ఆటగాళ్లను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.

ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన అదే రోజు అహ్మదాబాద్ చేరుకున్నారు. అంతే కాకుండా డెంగీ ఫీవర్ తో గత రెండు మ్యాచ్ లకి దూరమైన భారత డాషింగ్ ఓపెనర్ గిల్ ఈ పాకిస్థాన్ పోరు కి అందుబాటులోకి రావటం భారత్ కి కలిసోచ్చే అంశం.

అహ్మదాబాద్‌ వేదిక గా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ (India VS Pak)

ప్రపంచ క్రికెట్ లో దాయాదుల గొప్ప సమరంగా అభివర్ణించే భారత్‌, పాకిస్థాన్‌ (India VS Pak) మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదిక గా శనివారం జరగబోతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం లో మ్యాచ్ జరగబోతుంది. ఈ దాయాదుల పోరు కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లని చేసింది.

దాయాదుల సమరం కోసం భారీ ఏర్పాట్లు చేసిన BCCI

రేపు జరగబోయే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం BCCI భారీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచకప్ ప్రారంభం రోజు ఎలాంటి వేడుకలు నిర్వహించని బీసీసీఐ దాయాదుల పోరుకి భారీ ఏర్పాట్లని చేసింది. రేపు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇండియన్ పాపులర్ సింగర్స్ సుఖ్విందర్ సింగ్, అర్జిత్ సింగ్, శంకర్ మహదేవన్ పాటలతో అలరించనున్నారు. అంతే కాకుండా బాలివుడ్ సెలబ్రెటీలతో డాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసారు.

రేపు జరగబోయే ఈ మ్యాచ్ చూడటానికి లక్షమందికి పైగా అభిమానులు పోటెత్తనున్న నేపథ్యంలో గుజరాత్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌తో పాటు హోమ్‌ గార్డ్స్‌ కలిపి మొత్తం 11 వేలకు మందితో బందోబస్త్‌ ను ఏర్పాటు చేసారు.

ఈ ప్రపంచకప్ మెగాటోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లో గెలుపొందిన రోహిత్‌, బాబర్‌ సేనలకి ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా భావిస్తున్నారు. అయితే ప్రపంచ కప్‌లో పాక్‌పై టీమ్‌ఇండియాకు ఘనమైన రికార్డు ఉన్నది కాబట్టి రేపటి పోరులో టీం ఇండియా ఫేవరెట్ గ బరిలోకి దిగుతోంది.