Home   »  జాతీయం   »   ఎన్నికల కోసం మోదీ ప్రభుత్వం ఆర్మీని రాజకీయంగా వాడుకుంటుందన్న ఖర్గే

ఎన్నికల కోసం మోదీ ప్రభుత్వం ఆర్మీని రాజకీయంగా వాడుకుంటుందన్న ఖర్గే

schedule mahesh

న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కోసం సైన్యాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మంగళవారం విమర్శించారు. అంతే కాకుండా “సైనికుల ప్రజాదరణను పెట్టుబడిగా పెట్టడం” ద్వారా అధికార పార్టీ తన గౌరవాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు.

సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం ఆర్మీని కోరింది

సైనికుల ధైర్యసాహసాలకు బదులు తమ పథకాలను ప్రోత్సహించే విధంగా దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్మీని కోరిందని ఆయన మండిపడ్డారు.

దేశాన్ని రక్షించే మన భారత సైన్యం యొక్క ప్రజాదరణను ఉపయోగించుకోవడం ద్వారా మోదీ జీ తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారని ఖర్గే అన్నారు. ఎన్నికల కోసం సైన్యాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం ద్వారా మోదీ ప్రభుత్వం గత 75 ఏళ్లలో ఎన్నడూ జరగని పనిని చేసిందని ఖర్గే హిందీలో X(ట్విట్టర్) పోస్ట్‌లో తెలిపారు.

ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం 822 సెల్ఫీ పాయింట్ల ఏర్పాటు (Mallikarjun Kharge)

ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం దేశవ్యాప్తంగా 822 సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం ఆర్మీని కోరింది. అక్కడ సైనికుల ధైర్యసాహసాల కథల కు బదులుగా ప్రధాని మోదీ విగ్రహం లాంటి చిత్రం మరియు ఆయన పథకాలను ప్రశంసించారని కాంగ్రెస్ అధ్యక్షుడు పోస్ట్‌లో పేర్కొన్నారు.

భారత సైన్యం యొక్క శౌర్యం, త్యాగం గురించి భారత జాతీయ కాంగ్రెస్ చాలా గర్విస్తోందని ఖర్గే అన్నారు. జాతీయవాదానికి పాఠాలు చెప్పే బీజేపీ భారత సైన్యం గౌరవాన్ని దెబ్బతీసిందని ఖర్గే మండిపడ్డరు.