Home   »  జాతీయం   »   12వేల కోట్ల ప్ర‌జ‌ల డ‌బ్బును అదానీ గ్రూప్ దోపిడీ చేసిందన్న రాహుల్ గాంధీ

12వేల కోట్ల ప్ర‌జ‌ల డ‌బ్బును అదానీ గ్రూప్ దోపిడీ చేసిందన్న రాహుల్ గాంధీ

schedule mahesh

న్యూఢిల్లీ: వ్యాపార‌వేత్త అదానీ బొగ్గు దిగుమతుల్లో అదానీ గ్రూప్ (Adani Group) ఓవర్ ఇన్‌వాయిస్‌లు వేసి కుంభ‌కోణానికి పాల్ప‌డుతున్న‌ట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్ర‌జ‌ల‌ నుండి అధిక క‌రెంటు ఛార్జీల‌ను వ‌సూల్ చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు చెందిన సుమారు 12 వేల కోట్ల డ‌బ్బును అదానీ జేబులోకి మళ్లించారని రాహుల్ కేంద్ర స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

కేంద్ర స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన రాహుల్

బుధవారం న్యూఢిల్లీలో రాహుల్ మీడియా మాట్లాడుతూ అదానీ కోల్ స్కామ్ గురించి భార‌తీయ మీడియా ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదన్నారు. ఇండోనేషియా నుంచి అదానీ బొగ్గును కొనుగోలు చేస్తున్నార‌ని, ఆ బొగ్గు ఇండియాకు వ‌చ్చేలోగా, దాని ధ‌ర రెట్టింపు అవుతోంద‌న్నారు.

ఇండోనేషియా నుంచి అదానీ బొగ్గు కొనుగోలు

దీంతో మ‌న క‌రెంట్లు బిల్లులు కూడా పెరుగుత‌న్నాయ‌ని, పేద ప్ర‌జ‌ల నుంచి అదానీ సొమ్ము దోచుకుంటున్నార‌ని ప్ర‌జ‌ల నుంచి నేరుగా డ‌బ్బును వ‌సూల్ చేస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ మండిపడ్డారు.ఈ అంశంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

పేద ప్ర‌జ‌ల నుంచి Adani Group సొమ్ము దోచుకుంటున్నార‌ని రాహుల్ విమ‌ర్శ‌లు

నేను ప్రధానమంత్రికి మాత్రమే సహాయం చేస్తున్నాను. దర్యాప్తు ప్రారంభించి అతని విశ్వసనీయతను కాపాడుకోవాలని ఆయనను కోరుతున్నానని రాహుల్ అన్నారు. బొగ్గును అధికంగా ఇన్‌వాయిస్ చేయడం వల్ల దేశంలోని విద్యుత్ ధరలపై ప్రభావం చూపుతుందని మరియు వినియోగదారులు అధిక విద్యుత్ బిల్లులు చెల్లించేలా చేస్తున్నారని గాంధీ పేర్కొన్నారు. అదానీకి ప్రభుత్వం నుండి పూర్తి రక్షణ ఉంది, అతని వెనుక ఏ శక్తి ఉందో అందరికీ తెలుసని ఆయన తెలిపారు.