Home   »  రాజకీయం   »   రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్..

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్..

schedule mounika

రాహుల్(RAHUL) జీ.. దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ. మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి దేశ సాగునీటి రంగ చరిత్రలోనే.. అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించండి అని KTR అన్నారు. సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసిపట్టి.. బొట్టుబొట్టును ఎలా తెలంగాణ మాగాణాల్లోకి మళ్లిస్తున్నామో అర్థం చేసుకోండి. నీళ్లు పల్లమే కాదు.. బలమైన సంకల్పం ఉంటే ఎత్తుకు ఎలా పరుగులు పెడతాయో తెలుసుకోండి అని KTR అన్నారు.

కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోండి :KTR

పాతాళంలో ఉన్న గోదావరి నీటిని.. ఆకాశానికి ఎత్తిపోసే బాహుబలి మోటర్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండి.మొగులు వైపు చూసే దిగులు లేకుండా.. లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోండి. కాంగ్రెస్ హయాం నాటి ఆకలి కేకల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో కళ్లారా చూసి నేర్చుకోండి అని KTR అన్నారు.

Rahul Gandhi తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలి :KTR

అరవై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో అన్నదాతను అరిగోస పెట్టినందుకు, సాగునీటి కోసం నిత్యం సావగొట్టినందుకు తెలంగాణ రైతుకు బేషరతుగా క్షమాపణలి రాహుల్ గాంధీ అని KTR అన్నారు. 80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అని అర్థంలేని ఆరోపణలు చేసినందుకు కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా గట్టిగా లెంపలేసుకోండి అని KTR అన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి.. సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని మీరు మరో వంద జన్మలెత్తినా సాధించలేరని ఇప్పటికైనా ఒప్పుకోండి అని KTR ట్విట్టర్ వేదికగా తెలిపారు.