Home   »  రాజకీయం   »   కేటీఆర్ సమక్షంలో BRS లో చేరనున్న చెరుకు సుధాకర్..

కేటీఆర్ సమక్షంలో BRS లో చేరనున్న చెరుకు సుధాకర్..

schedule mounika

ఈరోజు శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సుధాకర్ (Sudhakar)BRS పార్టీలో చేరనున్నారు.

తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతల తీరుకు నిరసనగా డాక్టర్ చెరుకు సుధాకర్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తనకు ఎలాంటి పదవి లేకపోయినా ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం వ్యర్థమని భావించి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు.

కాంగ్రెస్ చెబుతున్న సామాజిక న్యాయం అమలు కావడం లేదు : Sudhakar

పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి ఆర్థిక ఆసరా ఉన్న వారికే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని, మధు యాష్కీ లాంటి బీసీ నేతలను కించపరిచేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాటలు తప్ప కాంగ్రెస్ చెబుతున్న సామాజిక న్యాయం అమలు కావడం లేదని ఆరోపించారు.

కాంగ్రెస్‌లో బీసీలకు స్థానం లేదు :Sudhakar

కాంగ్రెస్‌లో బీసీలకు స్థానం లేదని, ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ కు ఏనాడూ డిపాజిట్ రాని నియోజకవర్గాలలో బీసీలకు సీట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చివరకు మోసం చేసిందన్నారు.