Home   »  ఉద్యోగం   »   B.Tech విద్యార్హతతో ఉద్యోగాలు… ప్రారంభ వేతనం రూ.65,600…

B.Tech విద్యార్హతతో ఉద్యోగాలు… ప్రారంభ వేతనం రూ.65,600…

schedule sirisha

తెలంగాణ :Jobs |రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ మానవ వనరుల నియామకంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి సంవత్సరం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తాజాగా అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

నాలుగు శాఖల్లో 339 పోస్టులు (Jobs)

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాలుగు శాఖల్లో 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్ జెన్ కో వెల్లడించింది.

  • అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – జనరల్ రిక్రూట్‌మెంట్ – 145 పోస్టులు,
  • లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 42 పోస్టులు,
  • అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) – జనరల్ రిక్రూట్‌మెంట్ – 74 పోస్టులు,
  • లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ – 3 పోస్టులు
  • అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) – జనరల్ రిక్రూట్‌మెంట్ – 25
  • అసిస్టెంట్ పోస్టులు ఇంజనీర్ (సివిల్) –1,
  • లిమిటెడ్ రిక్రూట్‌మెంట్-49 పోస్టులు,

నాలుగు శాఖలకు సంబంధించి పరిమిత రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, సాధారణ రిక్రూట్‌మెంట్ సిస్టమ్ కింద 245 పోస్టుల భర్తీ చేయనున్నారు.

Jobs కి కావలసిన విద్యార్హతలు

AE(ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో B.Tech ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏఈ (మెకానికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెకానికల్ బ్రాంచ్‌లో బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

AE (ఎలక్ట్రానిక్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ మరియు పవర్ / పవర్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌లలో ఒకదానిలో B.Tech ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు అవుతారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 1, 2023 నాటికి 18-44 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులు. SC, ST, OBC (నాన్-క్రీమీ లేయర్), EWS కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు.

ప్రారంభ వేతనం

ఫైనలిస్టులను ఎంపిక చేసి అపాయింట్ మెంట్ ఖరారు చేస్తే ప్రారంభ వేతనం రూ.65,600-రూ.1,31,220 వరకు ఉంటుంది. ఇది ప్రారంభ వేతనం మాత్రమే.

దరఖాస్తు చేసుకునే విధానం

ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 29,2023, డిసెంబర్ 3వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష కేంద్రాలను హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో మాత్రమే నిర్వహిస్తారు.