Home   »  వార్తలు   »   తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కేసు CIDకి బదిలీ

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కేసు CIDకి బదిలీ

schedule chiranjeevi

తెలంగాణలో నకిలీ రశీదులు సృష్టించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించిన వారి ఫై కేసు నమోదైంది. అయితే ఈ కేసును CCS నుంచి CIDకి బదిలీ చేసినట్లు సమాచారం. గత నెలలో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను పరిశీలిస్తున్న సచివాలయ రెవెన్యూ శాఖ అధికారులు 4 నకిలీ రశీదులను గుర్తించారు. అదే నెల 21న సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీఎస్‌కు బదిలీ చేశారు.

విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులు మిర్యాలగూడ, ఖమ్మం పట్టణాల్లోని 2 ఆసుపత్రుల్లో రూ.8 లక్షల నకిలీ బిల్లులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మిర్యాలగూడకు చెందిన ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొందరు డబ్బు ఆశతో ఆధార్ కార్డులు తీసుకుని తమ పేర్లతో దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. మిర్యాలగూడ, ఖమ్మం జిల్లాల్లోని ఆసుపత్రుల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించారని పోలీసులు ప్రాథమికంగా భావించారు. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యుల పేర్లతో సహాయ నిధికి దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు.