Home   »  ఆంధ్రప్రదేశ్   »   AP Election: ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే..

AP Election: ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే..

schedule sirisha

AP Election |ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ 2024 మార్చిలో వచ్చే అవకాశం ఉందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఈసారి ఎన్నికలు సాధారణంగానే జరుగుతాయని, ముందస్తుగా ఏమీ చేయబోమని సచివాలయంలో వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Election) 2024 లో

ప్రస్తుతం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450. జనవరి 1, 2024 నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించనున్న సంగతి తెలిసిన విషయమే. ఇప్పటికే ఓటరు జాబితాను ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. చనిపోయిన వారి ఓట్లను తొలగించే పనిలో ఉన్నారు.

ఇప్పటికే 10 లక్షల బోగస్ ఓట్లను తీసేసారు. కొత్త ఓట్లను కూడా జోడిస్తోంది. ఈ ప్రక్రియ తెరవెనుక సాగుతోంది. ఎన్నికల ముసాయిదాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారు.

ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేయాలనుకునే వారు డిసెంబర్ 9వ తేదీలోగా చేసుకోవాలని తెలిపారు. తెలంగాణలో ఉన్నవారు తమ ఓటు హక్కును ఏపీకి మార్చుకోవచ్చు. ఈ మార్పుల కోసం ఒక్కో అసెంబ్లీ సీటు నంబర్ 4, 5లో ఒక్కో పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది.

డిసెంబర్ 2, 3 తేదీల్లో అక్కడికి వెళ్లి అభ్యంతరాలు తెలిపి దిద్దుబాటుకు దరఖాస్తు చేసువాలి. ఇదంతా డిసెంబరు 26 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తర్వాత 2024 జనవరి 5న తుది ఓటరు జాబితాను వెల్లడిస్తారు.