Home   »  అంతర్జాతీయం   »   Israel-hamas war|ఇజ్రాయెల్ ను విమర్శించిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో…

Israel-hamas war|ఇజ్రాయెల్ ను విమర్శించిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో…

schedule sirisha

Israel-hamas war | హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7ఇజ్రాయెల్ పై మెరుపు దాడి చేసి దాదాపు 224 మందిని బందీలుగా చేసుకున్నారు. తమ చెరలో ఉన్న ముగ్గురు బందీల వీడియోను హమాస్ విడుదల చేసింది. అందులో ఓ మహిళ ఇజ్రాయెల్ గురించి తప్పుగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారుతుంది.

Israel-Hamas war లో ఇజ్రాయెల్ విధానాన్ని విమర్శించిన మహిళ

76 సెకన్ల వీడియోలో, హమాస్ చెరలో బందీగా ఉన్న ఒక మహిళ బందీల విడుదల విషయంలో ఇజ్రాయెల్ విధానాన్ని విమర్శించింది. గత 23 రోజులుగా హమాస్ చేతిలో బందీగా ఉన్నానని ఆ మహిళ పేర్కొంది. బందీల విడుదల కోసం గాజాలో ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేస్తోందని తమకు తెలుసునని, అయితే భద్రతా కారణాలు, సైనిక వైఫల్యంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

నిజంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ముందుగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయండి. ఆపై వారిని హమాస్ జైలు నుంచి విడుదల చేయండి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, హమాస్ వద్ద బందీగా ఉన్న మహిళా సైనికురాలిని విడిపించినట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం వెల్లడించింది.

Also read : ఇజ్రాయెల్ దళాలతో పోరుకు సిద్ధం అంటున్న హమాస్