Home   »  రాజకీయం   »   తెలంగాణలో BJPకి 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి – రాహుల్ గాంధీ

తెలంగాణలో BJPకి 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి – రాహుల్ గాంధీ

schedule raju

నాగర్ కర్నూల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BJPకి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని, తెలంగాణలో పోటీ భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మధ్యేనని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.

ఎన్నికల ప్రచార సభలో Rahul Gandhi ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన ఒకే దశలో జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా.. ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా ఉన్న కె.చంద్రశేఖరరావుకు సమాధానం చెప్పే ఎన్నికలు ఈ ఎన్నికలు,ముందుగా అతన్ని బయటకు పంపాలి, ఆ తర్వాత తెలంగాణ ప్రజలను దోచుకున్న దోపిడి గురించి ప్రశ్నించాలి. అతను ప్రజల నుండి దోచుకున్న డబ్బును తిరిగి ప్రజలకు అందించాలని నేను అనుకుంటున్నాను.నేను ప్రధానమంత్రి నరేంద్రమోడీలా వాగ్దాన కర్తను మాత్రమే కాదు,నేను వాగ్దానం చేస్తే దానిని నెరవేరుస్తాను అని తెలిపాడు.

రాష్ట్రాన్ని ప్రజలే పాలించాలన్నది మా కల

ఈ ఎన్నికల విషయానికి వస్తే ఒకవైపు చంద్రశేఖరరావు, ఆయన కుటుంబం, ఆయన అవినీతి మంత్రులు మరోవైపు తెలంగాణాలోని పేదలు, రైతులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. తెలంగాణను ఈ రాష్ట్ర ప్రజలే పాలించాలన్నది మా కల. కానీ ఇప్పుడు తెలంగాణను ఒక రాజు మరియు అతని కుటుంబం ఫలిస్తోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

బీజేపీకి కేవలం 2 శాతం మాత్రమే ఓట్లు

ఇలాంటి వాతావరణంలో బీజేపీ గెలిస్తే వెనుకబడిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని ఇక్కడికి వస్తున్న బీజేపీ నేతలు అంటున్నారు. ఇక్కడ వారికి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ ఎలా పాలించగలరు? మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేసినా ఒవైసీ పార్టీ వస్తుంది. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని తమ అభ్యర్థులకు మద్దతిస్తారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు.

Also Read: రాష్ట్ర ప్రజలు BRSకు ప్రత్యామ్నాయంగా బీజేపీనే చూస్తున్నారన్న కిషన్‌రెడ్డి