Home   »  జాతీయం   »   SBI విక్రయించిన రూ. 12,000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌

SBI విక్రయించిన రూ. 12,000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌

schedule sirisha

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ అత్యధిక ఎలక్టోరల్ బాండ్ల (electoral bond) ను విక్రయించినట్లు ఆర్టీఐ ప్రశ్నలో వెల్లడైంది. ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, SBI హైదరాబాద్ శాఖ 33 శాతం ఎలక్టోరల్ బాండ్లను విక్రయించింది. అంటే ఈ శాఖ రూ.377.63 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విక్రయించింది.

రూ. 12,000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల (electoral bond)ను విక్రయించిన SBI

హైదరాబాద్ తర్వాత రూ.255.28 కోట్లతో కోల్‌కతా, రూ.177.90 కోట్లతో ముంబై, రూ.130.68 కోట్లతో న్యూఢిల్లీ, రూ.95.50 కోట్లతో చెన్నై ఉన్నాయి. కానీ బాండ్లను క్యాష్ చేసుకునే విషయానికి వస్తే హైదరాబాద్ శాఖకు రూ.83.63 కోట్లు మాత్రమే వచ్చాయి. న్యూఢిల్లీ రూ.800 కోట్లు, కోల్‌కతా రూ.171.28 కోట్లు, ముంబై రూ.39 కోట్లు, పాట్నా రూ.25 కోట్లు.

సుప్రీంకోర్టులో వాదించింన జనరల్ ఆర్ వెంకటరమణి

నిధుల మూలానికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం సమాచార హక్కు పౌరులకు లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో వాదించింది.

“ప్రశ్నలో ఉన్న స్కీమ్ కంట్రిబ్యూటర్‌కు గోప్యతా ప్రయోజనాన్ని విస్తరిచింది. ఇది స్వచ్ఛమైన డబ్బును అందించడాన్ని నిర్ధారించి ప్రోత్సహిస్తుంది. ఇది పన్ను బాధ్యతలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్న ఏ హక్కును ప్రభావితం చేయదు’’ అని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు వివరించింది.

అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే

ఎలక్టోరల్ బాండ్‌ (electoral bond) లు వ్యక్తులు లేదా సంస్థలు రాజకీయ పార్టీలకు డబ్బును విరాళంగా ఇవ్వడానికి అనుమతిస్తుంది. లావాదేవీ చాలావరకు ప్రైవేట్ సంరంక్షనలో సురక్షితంగా ఉన్నాయి. ఒక వ్యక్తి లేదా సంస్థ బ్యాంకు నుండి బాండ్లను కొనుగోలు చేయకోవచ్చు. వాటిని వారి రాజకీయ పార్టీకి ఇవ్వవచ్చు. విరాళంగా ఇచ్చిన డబ్బును స్వీకరించడానికి రాజకీయ పార్టీ ఈ బాండ్లను క్యాష్ చేసుకోవచ్చు.

ఎలక్టోరల్ బాండ్లను నిర్దిష్ట కాలవ్యవధిలో ఉపయోగించాలి. ప్రతి బ్యాంక్ వేర్వేరు చెల్లుబాటు వ్యవధిని అందిస్తుంది. ఈ బాండ్లు ఒక్కొక్కటి రూ.1,000, రూ.10,000, రూ.లక్ష, రూ.10 లక్షలు మరియు రూ.1 కోటి విలువలతో అందుబాటులో ఉంది. అతిపెద్ద డినామినేషన్ అత్యంత ప్రజాదరణ ఉంది.