Home   »  వినోదం   »   థాయ్‌లాండ్ వెళ్తున్న విజయ్… బ్యాంకాక్‌లో జరగనున్న విజయ్ సినిమా షూటింగ్.!

థాయ్‌లాండ్ వెళ్తున్న విజయ్… బ్యాంకాక్‌లో జరగనున్న విజయ్ సినిమా షూటింగ్.!

schedule raju

చెన్నై: వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న తన 68వ సినిమా (Thalapathy 68) షూటింగ్ కోసం నటుడు విజయ్ (Vijay) థాయ్‌లాండ్ వెళ్లారు. విజయ్ 68వ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించబోతున్నారు. AGS సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చారు. ఇందులో విజయ్ రెండు పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. దీని షూటింగ్ కొద్ది రోజుల క్రితం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

వెంకట్ ప్రభుతో విజయ్ మరో సినిమా “Thalapathy 68”

అజిత్‌తో రోగ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘మంగాథ‘ ఇచ్చిన వెంకట్ ప్రభుతో విజయ్ మరో సినిమా తీయడం కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలను పెంచింది. ఫస్ట్‌ అప్‌డేట్‌గా విజయ్ 68 సినిమా పూజా వీడియో విడుదలైంది. ఈ వీడియో ద్వారా జయరామ్, మైక్ మోహన్, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్, వీటీవీ గణేష్, యోగి బాబు, ప్రేమ్‌జీ అమరన్ తదితరులు తలపతి 68‘ (Thalapathy 68)లో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లైలా, స్నేహ, మీనాక్షి చౌదరి తదితరులు కూడా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించడం ఖాయం అని వార్తొలొస్తున్నాయి.

విజయ్ విమానాశ్రయానికి చేరుకున్న ఫొటోలు వైరల్

‘లియో’ సక్సెస్‌ను పూర్తి చేసుకున్న నటుడు విజయ్ ఇప్పుడు తలపతి 68 చిత్రం కోసం థాయ్‌లాండ్ వెళ్లాడు. ఇందుకోసం ఆయన విమానాశ్రయానికి చేరుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లియో సక్సెస్‌ తరువాత విజయ్ నెక్స్ట్ హిట్ కోసం రెడీ అవుతున్నాడని అభిమానులు అంటున్నారు. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ‘తలపతి 68’ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనుండడం గమనార్హం.

ప్రశాంత్, మోహన్, ప్రభుదేవా, స్నేహ, లైలా, జయరామ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం విజయ్, వెంకట్ ప్రభు సహా చిత్రబృందం అమెరికా వెళ్లింది.

బ్యాంకాక్‌లో సినిమా యాక్షన్ సన్నివేశాలు

ఈ స్థితిలో ముందురోజు (నవంబర్ 01) చెన్నైలో ‘లియో’ సినిమా విజయోత్సవ వేడుక చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ గా ముగిసింది. దీని తరువాత, ఈ రోజు (నవంబర్ 03) తెల్లవారుజామున విజయ్ ‘విజయ్ 68’ షూటింగ్ కోసం చెన్నై నుండి విమానంలో థాయ్‌లాండ్‌కు బయలుదేరారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కొన్ని రోజుల పాటు ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.

Also Read: “మా ఊరి పొలిమేర 2” మూవీ ట్విట్టర్ రివ్యూ.. అదిరిపోయే స్క్రీన్ ప్లే, ట్విస్టులు.!