Home   »  వినోదం   »   హైదరాబాద్ లో రిసెప్షన్ జరుపుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి..

హైదరాబాద్ లో రిసెప్షన్ జరుపుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి..

schedule sirisha

హైదరాబాద్: టాలీవుడ్ జంట కొణిదెల వరుణ్ , లావణ్య (Varun & Lavanya) ఇటీవల ఇటలీలోని టస్కనీలో వివాహం చేసుకున్నారు. వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నవంబర్ 5వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అందరూ ఈ వేడుకకు వచ్చారు.

కొన్నేళ్ల క్రితం డేటింగ్ ప్రారంభించిన వరుణ్ తేజ్, లావణ్య ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి ప్రేమకథ వారు కలిసినటించిన చిత్రం “మిస్టర్” సెట్‌లో ప్రారంభమై పెళ్లి పీటలెక్కింది. పెళ్లి నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జ‌రిగింది.

తన వివాహ రిసెప్షన్ కోసం, లావణ్య ఒక సొగసైన బంగారు చీరను స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో, నుదుటన సిందూరం మరియు సున్నితమైన ఆభరణాలతో చాలా నిడారంబరంగా తయారయ్యారు. బ్లాక్ ప్యాంట్‌తో నలుపు మరియు బంగారు బ్లేజర్‌లో దుస్తులు ధరించన వరుణ్ తేజ్, వారు కలిసి తమ రిసెప్షన్ కు హాజరయ్యారు.

గ్రాండ్ గా రిసెప్షన్ జరుపుకున్న వరుణ్ & లావణ్య (Varun & Lavanya)

మాదాపూర్‌లోని N కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, అడివి శేష్, సందీప్ కిషన్, నాగబాబు కొణిదెల, పద్మజ కొణిదెల, అల్లు శిరీష్, ఇండియన్ బ్యాడ్మింటన్ సెన్సేషన్ సైనా నెహ్వాల్ పాల్గొన్నారు. రిసెప్షన్‌కు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also read : ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్, లావణ్య గ్రాండ్ వెడ్డింగ్‌… ఫొటోలు వైరల్