Home   »  తెలంగాణ   »   తెలంగాణ ఎన్నికల ముందు రూ.525 కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం.!

తెలంగాణ ఎన్నికల ముందు రూ.525 కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం.!

schedule raju

హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు (TS Elections) జరగనున్న తరుణంలో నగదు, బంగారం, మద్యం, తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో రూ. 6.20 కోట్ల విలువైన నగదు, బంగారం తదితర వస్తువులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎన్నికల ముందు స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ.525 కోట్లు దాటింది.

రూ.179 కోట్ల నగదు, రూ.178 కోట్ల విలువైన లోహాల స్వాధీనం

నవంబర్ 8వ తేదీ ఉదయం 9 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 2.54 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (TS Elections) అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకు రూ. 179 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే, గత 24 గంటల వ్యవధిలో ఏ విధమైన విలువైన లోహాలను స్వాధీనం చేసుకోలేదు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న బంగారం, ఇతర విలువైన లోహాల విలువ రూ. 178 కోట్ల కు చేరుకుందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న విలువైన లోహాలలో 292 కిలోల బంగారం, 1,168 కిలోల వెండి, 19,269 క్యారెట్ల వజ్రం, 5.35 గ్రాముల ప్లాటినం ఉన్నాయి.

ఒక్క రోజులో 2,174 లీటర్ల మద్యం, నల్లబెల్లం స్వాధీనం

ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం…. నవంబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుండి నవంబర్ 8వ తేదీ ఉదయం 9 గంటల వరకు రూ. 2.72 కోట్ల విలువైన 2,174 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మద్యం మరియు నల్లబెల్లం విలువ ఇప్పుడు 69 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు 1.20 లక్షల లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గత 24 గంటల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రూ. 4257 లక్షలు విలువైన గంజాయి మరియు NDPS స్వాధీనం చేసుకున్నారు. దీంతో పట్టుబడిన గంజాయి, NDPS విలువ రూ. 31.14 కోట్లకు చేరింది. స్వాధీనం చేసుకున్న వాటిలో 7,998 కిలోల గంజాయి ఉంది.

బియ్యం, చీరలు, ఇతర వస్తువుల స్వాధీనం | TS Elections

ఇతర ఉచితాలపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తమ అణిచివేతను కొనసాగించాయి. గత 24 గంటల్లో జరిగిన తనిఖీల్లో రూ. 51.56 లక్షల విలువైన బియ్యం, చీరలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం మీద స్వాధీనం రూ. 66.61 కోట్లు. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 1.90 లక్షల కిలోల బియ్యం, 9,159 కుక్కర్లు, 83,991 చీరలు, ఏడు ద్విచక్ర వాహనాలు, ఐదు 4 వీలర్లు, 10,229 గడియారాలు, 72,330 మొబైల్ ఫోన్లు, 6,138 ఫ్యాన్లు, 101 కుట్టు మిషన్లు, 362 లంచ్ బాక్స్‌లు, 362 ఆభరణాలు ఉన్నాయి.

Also Read: దుండిగల్ పోలీసుల వాహన తనిఖీల్లో రూ.50 లక్షల నగదు స్వాధీనం..