Home   »  వార్తలు   »   చదువులో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

చదువులో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

schedule sirisha

హైదరాబాద్: విద్యారంగంలో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం తెలిపారు. ఈ తరగతులను పాఠశాల పూర్వ విద్యార్థులు స్థానిక యువత మరియు NGO లతో కూడిన వాలంటీర్లు నిర్వహిస్తారు.

మహేశ్వరం నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ కొత్త కార్యక్రమం మొత్తం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు కూడా విస్తరిస్తాయని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకు చదువులో వెనుకబడిన విద్యార్థులను స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గుర్తించి వారికి ఈ వేసవి సెలవుల నుంచే స్థానిక పాఠశాలల్లో తరగతులు ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి ఒక్కరు ఉన్నత విద్య అందుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పుకొచ్చారు.ఇంకా ఈ పోటీ ప్రపంచం తో పోటీ పడి చదవాలని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అని ఆమె కొనియాడారు.