Home   »  వినోదం   »   Tiger3 Box Office Collection Day 3: 146 కోట్లు వసూలు చేసిన “టైగర్ 3”

Tiger3 Box Office Collection Day 3: 146 కోట్లు వసూలు చేసిన “టైగర్ 3”

schedule raju

Tiger3 Box Office Collection Day 3: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan), కత్రినా కైఫ్ (Katrina Kaif) జంటగా నటించిన ‘టైగర్ 3’ చిత్రం నవంబర్ 12, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే కోట్ల వసూళ్లు రాబట్టింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

Tiger3 Box Office Collection Day 3

టైగర్ 3’ చిత్రం థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

  1. మొదటి రోజు: 44.5 కోట్లు
  2. రెండో రోజు: 59 కోట్లు
  3. మూడో రోజు : 42.50 కోట్లు
  4. గ్రాస్ కలెక్షన్ : 146 కోట్లు

సల్మాన్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ మూవీ

సల్మాన్ కెరీర్‌లో ‘టైగర్ 3’ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్‌కి వెళ్లి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కూడా కనిపిస్తాడు. టైగర్ 3 సినిమాలో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్ రోల్ పోషించాడు.

‘టైగర్ 3’ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. యష్ రాజ్ స్పై యూనివర్స్ యొక్క టైగర్ ఫ్రాంచైజీకి ఇది మూడవ చిత్రం. గతంలో ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘టైగర్ 3’ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ సినిమాకి సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.

Also Read: ఈ వారం OTT లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు