Home   »  వినోదం   »   పుష్ప 2 జాతర షూటింగ్ లో అల్లు అర్జున్ డెడికేషన్.!

పుష్ప 2 జాతర షూటింగ్ లో అల్లు అర్జున్ డెడికేషన్.!

schedule raju

pushpa 2 Movie shooting: అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో తన కొత్త చిత్రం పుష్ప 2 షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాలో గంగమ్మ జాతరకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, నెల రోజుల విరామం తర్వాత, “పుష్ప 2” నిర్మాణ పనులు శరవేగంగా తిరిగి ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా, పుష్ప అన్ని భాషల్లో థియేట్రికల్ రైట్స్ నుండి 1000 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.

Allu Arjun dedication in Pushpa 2 Movie shooting

pushpa 2 Movie shooting: అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో తన కొత్త చిత్రం పుష్ప 2 షూటింగ్ లో ఉన్నాడు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో, జాతరకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

పుష్ప సీక్వెల్ పైనే అందరి దృష్టి

అల్లు అర్జున్ పుష్పలో తన అద్భుతమైన నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నప్పటి నుండి, అందరి దృష్టి పుష్ప: ది రైజ్ (Pushpa 1) చిత్రం యొక్క సీక్వెల్ “పుష్ప 2: ది రూల్ (Pushpa 2)” పైనే ఉంది.

RFCలో pushpa 2 Movie shooting

సినిమా షూటింగ్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం… ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ మరియు ఒక చిన్న వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే , ఆ వీడియోలో గంగమ్మ జాతరకు సంబందించిన సన్నివేశాలు ప్రస్తుతం RFCలో (pushpa 2 Movie shooting) చిత్రీకరించబడుతున్నాయి. అల్లు అర్జున్ జాతర సన్నివేశంలో క్రేజీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఈ జాతర బ్యాక్‌డ్రాప్‌కి సినిమాలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక పాటను, ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. అదే సెటప్‌లో మరిన్ని సన్నివేశాలను (pushpa 2 Movie shooting) చిత్రీకరించనున్నారు. అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత మిగతా షూటింగ్ కోసం అల్లు స్టూడియోస్‌కి పుష్ప మూవీ యూనిట్ వెళ్లనుంది.

క్యారెక్టర్‌లోకి రావడానికి అల్లు అర్జున్ దాదాపు 2 గంటల పాటు మేకప్ వేసుకోవడంతో ఈ షూటింగ్ మీద తనకున్న అంకితభావం (dedication)తెలుస్తున్నదని, ఆ రోజు ఒక్క షాట్ కోసం నటుడు రోజంతా సెట్‌లోనే సిద్ధంగా వేచి ఉన్నాడని సమాచారం. ఐకాన్ స్టార్ యొక్క ఈ అంకితభావం సెట్‌లో ఇతరులను ఉత్తేజపరిచేలా ఉందని సమాచారం.

వేగం పుంజుకున్న ‘పుష్ప 2’ షూటింగ్

నెల రోజుల విరామం తర్వాత, “పుష్ప 2” నిర్మాణ పనులు (pushpa 2 Movie shooting) శరవేగంగా తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో భారీ ఎపిసోడ్‌ షూటింగ్‌ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో గంగమ్మ జాతరకు సంబంధించిన సీక్వెన్స్, ఒక పాట, కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

డిసెంబరు నెలాఖరులోగా అల్లు అర్జున్ కు సంబంధించి కీలక భాగాలను పూర్తి చేయాలని దర్శకుడు సుకుమార్ వ్యూహం రచించారు. ఈ సినిమా హైప్ దృష్ట్యా, రెండవ భాగం ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో భారీగా వసూళ్లు సాదిస్తుందని అంచనా. దీంతో దర్శకుడు సుకుమార్ తన పూర్తి సమయాన్ని ఈ సినిమా (pushpa 2 Movie shooting)పై వెచ్చించి ప్రతి విషయాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.

విడుదల ముందే పోటీ పడుతున్న స్టార్ హీరోల సినిమాలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం పుష్ప 2 మరియు సాలార్ సినిమాలలో బిజీ గా ఉన్నారు. సాధారణంగా, స్టార్ హీరోల సినిమాలు ఒకే తేదీ లేదా ఒకే వారంలో విడుదల చేసినప్పుడు బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడుతాయి. అయితే ఆసక్తికరమైన పరిణామంలో ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదల కాకుండానే పోటీ పడుతున్నాయి.

ఒక వైపు, అల్లు అర్జున్ తన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప యొక్క మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్‌తో వస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ సాలార్ సినిమాతో వస్తున్నాడు. KGF సిరీస్ దర్శకుడు మరియు బాహుబలి యొక్క హీరో నుండి వస్తున్న ఈ చిత్రం దేశం మొత్తం మీద అద్భుతమైన బజ్‌ను సృష్టిస్తుంది.

సాలార్ VS పుష్ప 2 ప్రీ-రిలీజ్ బిజినెస్‌

ట్రేడ్ రిపోర్ట్‌ల ప్రకారం… ఈ రెండు సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టిస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఎంత బిజినెస్ జరిగిందనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఈ రెండు చిత్రాలకు భారీ డిమాండ్ ఉందని, ఫైనల్ ప్రీ బిజినెస్‌లో ఏ చిత్రం విజేతగా నిలుస్తుందో వేచి చూడాలి.

ఇటీవల, పుష్ప 2 గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చెయ్యడంతో దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. సాలార్ మేకర్స్ కూడా తమ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రికార్డులను సృష్టించింది. పుష్ప 2 లో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న మరియు ఫహద్ ఫాజిల్ వంటి తారలు నటిస్తున్నారు. అయితే సాలార్‌లో ప్రభాస్ సరసన శృతి హాసన్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు సినిమాల్లోనూ జగపతి బాబు కనిపిస్తాడట.

విడుదలకు ముందే 1,000 కోట్ల క్లబ్‌లో చేరిన పుష్ప 2

అల్లు అర్జున్ యొక్క పుష్ప 2 ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. పుష్ప 2 అద్భుతమైన ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. పుష్ప అన్ని భాషల్లో థియేట్రికల్ రైట్స్ నుండి 1,000 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. అయితే, పుష్ప 2 విడుదలకు ముందే రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరింది. దీని డిజిటల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా హక్కులను దక్కించుకునేందుకు పలు OTT దిగ్గజాలు పోటీపడుతున్నాయి.

ఆగస్ట్ 15, 2024న విడుదల కానున్న పుష్ప 2

పుష్ప 2 చిత్రం ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన (pushpa 2 Movie shooting) ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, మరియు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

Also Read: Pushpa The Rule: పుష్పరాజ్‌ వచ్చేస్తున్నాడు.. పుష్ప 2’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలు!