Home   »  రాజకీయం   »   DK శివకుమార్‌పై CBI విచారణను ఉపసంహరించుకున్న కర్ణాటక మంత్రివర్గం..!

DK శివకుమార్‌పై CBI విచారణను ఉపసంహరించుకున్న కర్ణాటక మంత్రివర్గం..!

schedule mahesh

బెంగళూరు: ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ పై(dk Shivakumar) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని కర్ణాటక క్యాబినెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

dk shivakumar

dk Shivakumar పై CBI విచారణ ఉపసంహరించుకునేందుకు మంత్రివర్గం ఆమోదం

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్.కె. పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌పై (dk Shivakumar) సీబీఐ విచారణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

గతంలో శివకుమార్ ఫై CBI కి ఫిర్యాదు చేసిన బీజేపీ ప్రభుత్వం

గతంలో బీజేపీ ముఖ్యమంత్రి శివకుమార్‌పై (dk Shivakumar) సీబీఐ దర్యాప్తునకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం వారు స్పీకర్ నుండి అనుమతి పొందాలి. స్పీకర్ అనుమతి తీసుకోకుండానే మాజీ సీఎం మౌఖికంగా సీబీఐ విచారణకు ఆదేశించారు. మాజీ, ప్రస్తుత అడ్వకేట్ జనరల్ (ఏజీ)ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నుండి అనుమతి లభించనందున కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధంగా పరిగణించబడిందని హెచ్.కె. పాటిల్ తెలిపారు.

CBI విచారణకు కేసు సరైనది కాదని అభిప్రాయపడ్డ మాజీ అడ్వకేట్ జనరల్

ఈ కేసు సీబీఐ విచారణకు సరైనది కాదని మాజీ అడ్వకేట్ జనరల్ అభిప్రాయపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వం ఈ అభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ అనుమతి తెలిపిందన్నారు. మాజీ అడ్వకేట్ జనరల్ అభిప్రాయం ఆధారంగా ప్రస్తుత A.G శశికిరణ్ శెట్టి కూడా ఈ కేసు సీబీఐ విచారణకు సరైనది కాదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 577 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయని, ఒక్క కేసు కూడా సీబీఐకి అప్పగించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వాదించింది. ఈ కేసులపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. క్యాబినెట్ నిర్ణయంపై ప్రతిపక్ష నాయకుడు R.అశోక స్పందిస్తూ ఈ కేసు కోర్టులో ఉంది మరియు ఈ నిర్ణయం చట్టానికి విరుద్ధం అని వ్యాఖ్యానించారు.

CBI విచారణకు అనుమతి ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం సరైంది కాదన్న R అశోక

ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ కోర్టులో అప్పీలు చేసింది. తీర్పు రాకముందే శివకుమార్‌పై సీబీఐ విచారణకు అనుమతి ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం సరికాదన్నారు. ఇలా అయితే ప్రభుత్వం మారినప్పుడల్లా అందరూ అదే చేస్తారన్నారు.

Also Read: సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్