Home   »  చదువు   »   ఓపెన్ 10th, ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదల..

ఓపెన్ 10th, ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదల..

schedule sirisha

హైదరాబాద్: Open 10th-Inter Exam Result | తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) అక్టోబర్ 16 నుండి 26 వరకు నిర్వహించిన సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను వెల్లడించింది.

Open 10th-Inter Exam Result

Open 10th-Inter Exam Result | ఓపెన్ SSC, ఇంటర్ పరీక్ష ఫలితాలు

Open 10th-Inter Exam Result | TOSS SSC మరియు ఇంటర్ ఎగ్జామ్ 2023లో హాజరైన SSC మరియు 12వ తరగతికి చెందిన విద్యార్థులు అక్టోబర్ 16 నుండి 26 వరకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తెలంగాణ SSC & ఇంటర్ ఓపెన్ ఫలితాలు 2023 పరీక్షా బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.telanganaopenschool.org లో యాక్సెస్ చేయవచ్చు.

SSC పరీక్షలకు, మొత్తం 11,357 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 4,053 మంది అభ్యర్థులు ఉత్తీర్ణతను సాధించారు. ఫలితంగా 35.69 ఉత్తీర్ణత శాతం వెలువడింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి 15,348 మంది అభ్యర్థులు హాజరవగా, 8,191 మంది అభ్యర్థులు ఉత్తీర్ణతను సాధించారు. 53.37 ఉత్తీర్ణత శాతం వెలువడినట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారులు తెలిపారు.

ఉతీర్ణులైన అభ్యర్థులకు ముద్రించిన మార్కుల మెమోను 15 రోజుల్లో వారి సంబంధిత సంస్థలకు పంపిస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి మెమో కాపీని కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మార్కుల రీకౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ కోరుకునే అభ్యర్థుల కోసం, ఫీజు చెల్లింపు విండో డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 16 వరకు ఉందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

మెమోలలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే డిసెంబర్ 21 లోపు హైదరాబాద్‌లోని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర కార్యాలయానికి జిల్లా విద్యా అధికారి (DEO), హెడ్‌మాస్టర్, ప్రిన్సిపాల్ లేదా AI కోఆర్డినేటర్ ద్వారా నివేదించాలని తెలిపారు. నిర్దేశిత తేదీ తర్వాత దిద్దుబాట్లకు సంబంధించి ఎలాంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు. అందువల్ల అభ్యర్థులు మెమో రాగానే ఏమైనా తప్పులు ఉన్నాయా అని జాగ్రత్తగా చూసుకొని వెంటనే స్పందించాలని వెల్లడించారు.

అధికారిక వెబ్‌సైట్ లేదా మీ-సేవా ద్వారా నిర్ణీత తేదీల్లో ఫీజు చెల్లింపులు చేయవచ్చు. SSC అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం రూ. 350 మరియు రీ-వెరిఫికేషన్ కోసం రూ. 1,200, ఇంటర్మీడియట్ అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం రూ. 400, రీ-వెరిఫికేషన్ కోసం రూ. 1,200 చెల్లించాల్సి ఉంటుంది.

Also read: IIM CAT 2023 ఆన్సర్ కీ విడుదల..