Home   »  అంతర్జాతీయం   »   ఐక్యరాజ్యసమితిలో గాజాకు అనుకూలంగా ఓటు వేసిన భారత్

ఐక్యరాజ్యసమితిలో గాజాకు అనుకూలంగా ఓటు వేసిన భారత్

schedule mahesh

Israel – Gaza War: ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య యుద్ధం (Israel – Gaza War) ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ యుద్ధంలో ఇరువైపులా సైనిక బలగాలే కాకుండా సామాన్య పౌరులు కూడా వేలాదిగా మరణించారు. ఇక గాజాలో ఇజ్రాయెల్ సైన్యం తలపెట్టిన భూతల దాడులతో పాలస్తీనా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

Israel – Gaza Warతో గాజాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు

ఈ క్రమంలోనే గాజాలో పరిస్థితి, కాల్పుల విరమణపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో (United Nations) తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేయడం జరిగింది. ఇజ్రాయెల్- హమాస్‌ యుద్ధంతో గాజాలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు హమాస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుదెవుడా అంటూ జీవిస్తున్నారు.

దీంతో వెంటనే ఇరు పక్షాలు తక్షణ కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకోవాలని అంతేకాకుండా ఎలాంటి షరతులు లేకుండా తమ చెరలో వున్న బందీలను విడిచిపెట్టాలని హమాస్ ఉగ్రవాదులను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో (United Nations) ముసాయిదా తీర్మానాన్ని తీసుకొచ్చారు. దీనికి అనుకూలంగా భారత్‌ ఓటు వేయడం జరిగింది.

United Nations జనరల్ అసెంబ్లీ లో కాల్పుల విరమణ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఈజిప్టు

ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశంలో భాగంగా ఈ తీర్మానాన్ని ఈజిప్ట్ ప్రవేశపెట్టింది. మొత్తం ఐరాసలోని 193 సభ్యదేశాల్లో 153 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినట్టు తెలుస్తుంది. మరో 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా వున్నాయి. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అయితే గాజాలో తక్షణ కాల్పుల విరమణ, బంధీల విడుదలకు సంబంధించి ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ప్రసంగించింది.

ఐరాస జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన భారత్

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం, దాని పర్యవసానాల గురించి ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసిందని వెల్లడించారు. అక్టోబర్ 7 వ తేదీన ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరిగిందని అప్పుడు హమాస్‌ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్న వారి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తమైందన్నారు.

అయితే అందుకు ప్రతీకారంగా ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న ప్రతి దాడులతో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోందని, మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని రుచిరా కాంబోజ్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీర్ఘకాలిక పాలస్తీనా సమస్యల నిర్మూలనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రుచిరా కాంబోజ్ తెలిపారు.