Home   »  జాతీయం   »   కేరళలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్..

కేరళలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్..

schedule sirisha

Corona virus | కేరళలో గడిచిన 24 గంటల్లో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేగాక కోవిడ్-19 కారణంగా రెండు మరణాలు కూడా సంభవించాయి. శుక్రవారం దేశంలో 237 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1296కి పెరిగింది.

Corona virus is booming again in Kerala..

Corona virus | గడిచిన 24 గంటల్లో 19 కరోనా కేసులు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంది. కనుమరుగైందని అనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ కేసులు కేరళలో రాష్ట్రంలో పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేరళలో గడిచిన 24 గంటల్లో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేగాక కోవిడ్-19 కారణంగా రెండు మరణాలు కూడా సంభవించాయి.

అధికారిక లెక్కల ప్రకారం, రాష్ట్రంలో నవంబర్ నెలలో 470 కేసులు నమోదు కాగా, డిసెంబర్ మొదటి పది రోజుల్లోనే 825 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో అత్యధికంగా కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. శ్వాస సంబందిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగులలో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు పేర్కొన్నారు.

దక్షిణ కేరళలో గుర్తించిన ఒమిక్రాన్ JN.1 సబ్ వేరియంట్‌

ఒమిక్రాన్ JN.1 సబ్ వేరియంట్‌ని దక్షిణాది రాష్ట్రంలో ముందుగా గుర్తించినట్లు నివేదికలు ఉన్నప్పటికీ కూడా వైరస్ పై నిరంతర పర్యవేక్షణ అవసరమని అధికారులు స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం ఆంక్షలు, నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం సింగపూర్, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో ఈ తరహా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం లేదా ఇన్సాకోగ్ నుంచి వచ్చిన JN.1 వేరియంట్ ఉనికిని కేరళలో గుర్తించారు.

కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం

మొదట లక్సెంబర్గ్‌లో ఆగస్టు నెలలో మొదట ఈ వేరియంట్ ను కనుగొన్నారు. పిరోలా వేరియంట్ అని కూడా పిలువబడే B.A.2.86 ను ఈ ఏడాది జులైలో డెన్మార్క్ దేశంలో మొదటిసారి గుర్తించారు. కాగా భారతదేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1296 గా ఉంది. మరనాల సంఖ్య 5,33,310గా నమోదయింది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,03,830గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,69,536కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.

Also read: భారతదేశంలో 148 కొత్త COVID -19 కేసులు నమోదు