Home   »  వినోదం   »   Bigg Boss 7: బిగ్‌బాస్ షో గొడ‌వ‌పై… కేసు న‌మోదు చేసిన పోలీసులు

Bigg Boss 7: బిగ్‌బాస్ షో గొడ‌వ‌పై… కేసు న‌మోదు చేసిన పోలీసులు

schedule ranjith

Bigg Boss 7 | బిగ్‌బాస్‌ షో గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌ ఫ్యాన్స్‌ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

Bigg Boss 7: The police have registered a case against the Bigg Boss show fight

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో 2023 డిసెంబర్ 17న జరిగిన బిగ్‌బాస్‌ షో ఫైనల్ అనంతరం పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌ ఫ్యాన్స్‌ మధ్య జరిగిన గొడవపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌పై హింస, అల్లర్లు, ఆర్థిక నష్టం కలిగించడం, హద్దులను దాటి దాడి చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమర్‌ దీప్‌ ఫ్యాన్స్‌పై కూడా అదే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Bigg Boss 7 గొడవలో పలు ఆర్టీసీ బస్సుల ద్వంసం

ఈ గొడవలో పలు ఆర్టీసీ బస్సుల అద్దాలు ద్వంసం చేశారు. అలాగే, పలు వాహనాలు, దుకాణాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పోలీసులు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవపై తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ కూడా స్పందించారు. ఈ గొడవను ఖండిస్తూ, బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు, ఫ్యాన్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తాజాగా ఈ ఘటనపై T.S.R.T.C M.D సజ్జనార్‌ కూడా ఎక్స్‌(X)లో స్పందించారు.

T.S.R.T.C బస్సులు ప్రజల ఆస్తి

అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్‌(X)లో పేర్కొన్నారు.

ఫాన్స్‌ దాడిలో 6 బస్సుల అద్ధాలు ధ్వంసం

ఫాన్స్‌ దాడిలో 6 బస్సుల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో T.S.R.T.C అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు F.I.R కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Salaar action trailer: సలార్ యాక్షన్ ట్రైలర్ విడుదల వివరాలు