Home   »  రాజకీయం   »   విజయవంతంగా ముగిసిన లోకేష్ పాదయాత్ర..

విజయవంతంగా ముగిసిన లోకేష్ పాదయాత్ర..

schedule mounika

విశాఖపట్నం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆధ్వర్యంలో 226 రోజుల పాటు చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర సోమవారం విశాఖపట్నంలోని గాజువాకలో ముగిసింది. ఈ మహాప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ నారా లోకేశ్‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సందర్భంగా గాజువాకలోని ప్రకాష్ నగర్‌లో నారా లోకేష్‌తో పాటు టీడీపీ-జేఎస్పీ కార్యకర్తలు, మద్దతుదారులు పైలాన్‌ను ఆవిష్కరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ముగిసిన చోటే లోకేష్ పాదయాత్ర కూడా ముగిసింది.

Nara Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)ఆధ్వర్యంలో 226 రోజుల పాటు చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర సోమవారం విశాఖపట్నంలోని గాజువాకలో ముగిసింది. ఈ మహాప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ నారా లోకేశ్‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సందర్భంగా గాజువాకలోని ప్రకాష్ నగర్‌లో నారా లోకేష్‌తో పాటు టీడీపీ-జేఎస్పీ కార్యకర్తలు, మద్దతుదారులు పైలాన్‌ను ఆవిష్కరించారు.

పాదయాత్ర చివరి ఘట్టంలో పాల్గొన్న లోకేశ్ తల్లి..

ఈ కార్యక్రమం జై లోకేశ్, జై తెలుగుదేశం నినాదాలతో మారుమోగింది. గాజువాక నియోజకవర్గంలోని సీబీసీ-1 నుంచి ప్రారంభమైన పాదయాత్ర వేలాది మంది కార్యకర్తల మధ్య ఉత్సాహంగా సాగింది. అడుగడుగునా యువనేతకు ప్రజలు నీరాజనాలు పలికారు. లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి తదితరులు పాదయాత్ర చివరి ఘట్టంలో చేరారు.

వేడుకలకు గుర్తుగా సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. పటాకులు పేల్చారు, డప్పుచప్పుళ్లు యాత్ర పొడవునా ప్రతిధ్వనించాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు K. అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, గాజువాక ఇన్‌చార్జి పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది: లోకేశ్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని, టీడీపీ అధికారంలోకి రాగానే ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు పార్లమెంట్‌లో గళం విప్పుతారని పాదయాత్రలో లోకేష్(Nara Lokesh) స్పష్టం చేశారు.

జగన్‌ పై పెండింగ్‌లో ఉన్న కేసులపై కేంద్రం మళ్లీ విచారణ చేపడుతుందన్న భయం ఉంది: లోకేశ్

YCP ని ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. తాను వ్యతిరేకిస్తే తనపై పెండింగ్‌లో ఉన్న కేసులపై కేంద్రం మళ్లీ విచారణ చేపడుతుందన్న భయం జగన్‌కు ఉందని లోకేష్‌ అన్నారు. కొందరు స్థానిక పారిశ్రామికవేత్తలతో చేతులు కలిపి 8 వేల ఎకరాల స్టీల్ ప్లాంట్ భూములను కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించారని లోకేష్ ఆరోపించారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం: లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. మళ్లీ అధికారంలోకి రాగానే పట్టణ ప్రాంతాల్లో చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు నిర్మించి ఇస్తామని, అన్ని వసతులతో కూడిన కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు.

ALSO READ: చోడవరం-అనకాపల్లి మధ్య రైల్వే బ్రిడ్జిని పూర్తి చేస్తాం: లోకేశ్