Home   »  ఉద్యోగం   »   మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు…

మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు…

schedule sirisha

Child Welfare Department | తెలంగాణలోని హైదరాబాద్‌ లో WDCWD విభాగంలో క్రాంట్రాక్ట్‌ లేదా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పలు పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

Jobs in Women and Child Welfare Department

Child Welfare Department | ఉద్యోగ అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశం. హైదరాబాద్‌లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే వీటిని కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్‌ 29వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు.

Child Welfare Department ఉద్యోగాల వివరాలు

  • మొత్తం పోస్టులు – 31
  • ఉద్యోగాల పేర్లు – మేనేజర్, సోషల్ వర్కర్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, ప్రీ-స్కూల్ టీచర్, పీడియాట్రీషియన్, చౌకీదార్, ఆయా, డేటా ఎంట్రీ ఆపరేటర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్, కేస్ వర్కర్.
  • అర్హతలు – పోస్టును అనుసరించి SSC , ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. MSW, సోషియాలజీ చేసిన వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. పలు పోస్టులను ఇంటర్ అర్హత మీదనే భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
  • జీతం – పోస్టులపై ఆధారపడి ఉంటుంది.
  • దరఖాస్తు విధానం – ఆన్ లైన్ లో దరఖాస్తు ఫారమ్ లను డౌన్లోడ్ చేసుకోని వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిని సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, 4వ అంతస్తు, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్, కలెక్టరేట్, లక్డీకపూర్, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం – అర్హతలు, అనుభవాలను బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సమాచారం అందిస్తారు.
  • దరఖాస్తుకు చివరి తేదీ- డిసెంబర్‌ 29, 2023.
  • అధికారిక వెబ్‌సైట్‌ : https://hyderabad.telangana.gov.in/

Also read: త్వరలో 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ : మంత్రి సీతక్క