Home   »  రాజకీయం   »   కాళేశ్వరం ప్రాజెక్టును రూ.80వేల కోట్లతో కట్టామని చెప్పడం అబద్దం: CM రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టును రూ.80వేల కోట్లతో కట్టామని చెప్పడం అబద్దం: CM రేవంత్ రెడ్డి

schedule mounika

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా… బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్ రావు పలు అంశాలను ప్రస్తావించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే సందర్భంలో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్ తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.80వేల కోట్లతో కట్టామని చెప్పడం శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

CM Revanth Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా… బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే సందర్భంలో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్ తీసుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది: CM Revanth Reddy

సభను తప్పుదోవ పట్టించేలా హరీశ్ రావు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై తప్పులు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం అంచనా రూ. 80 వేల కోట్లు కాదన్నారు. కాళేశ్వరం కార్పోరేషన్ రుణమే రూ.97,448 కోట్లు మంజూరయిందని, ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. వేల కోట్ల అప్పులను తీసుకొచ్చి… ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుటికైనా తప్పులు ఒప్పుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తీసుకువచ్చారు: రేవంత్ రెడ్డి

కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి మరీ అప్పులు తీసుకువచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం నీటితో ప్రతి సంవత్సరం రూ.5 వేల కోట్లు సంపాదిస్తామని చెప్పారని గుర్తు చేశారు. మిషన్ భగీరథతో రూ.5,700 కోట్లు సంపాదిస్తామని చెప్పినట్లు తెలిపారు.

సభను తప్పుదోవ పట్టించేలా హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారు: రేవంత్ రెడ్డి

బడ్జెట్ తయారీలో లోపాలు ఉన్నాయని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇలాంటి వాస్తవాలు ఉన్నప్పటికీ… సభను తప్పుదోవ పట్టించడానికి హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని చెప్పే వారిపై చర్యలు తీసుకోనే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కోరారు.

ALSO READ: కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో మాయమాటలు చెబుతోంది: హరీశ్‌రావు