Home   »  రాజకీయం   »   తెలంగాణ భవన్ వేదికగా “స్వేద పత్రం” పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాం: KTR

తెలంగాణ భవన్ వేదికగా “స్వేద పత్రం” పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాం: KTR

schedule mounika

కాంగ్రెస్ “శ్వేతపత్రం” విడుదలతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగిన సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే రాష్ట్రంలో జరిగిన ప్రగతి విషయంలో మరోసారి కౌంటర్ ఇచ్చేందుకు BRS రెడీ అయింది. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ భవన్ వేదికగా “స్వేద పత్రం” పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(K T Rama Rao) ప్రకటన చేశారు.

KT Rama Rao

అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం: K T Rama Rao

తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని, విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించమని, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోమని K T Rama Rao అన్నారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా “స్వేద పత్రం” పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాం” అని కేటీఆర్ (K T Rama Rao) తన పోస్టులో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని (K T Rama Rao)చెప్పారు.

సీఎంకు దాసోజు శ్రవణ్‌కుమార్‌ బహిరంగ లేఖ..

కాగా, C.M కు దాసోజు శ్రవణ్‌కుమార్‌ బహిరంగ లేఖ రాశారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మీ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? కేవలం పత్రికా సమావేశాలు నిర్వహించి సదరు పత్రాలు విడుదల చేస్తే ప్రజలకు తెలియదా? ప్రతిపక్షాలు వాటికి సమాధానం ఇవ్వరా? తప్పు జరిగితే విచారణలకు ఆదేశించడానికి అసెంబ్లీ సమావేశాలు వేదిక కావాల్నా ఆలోచించండి అని పేర్కొన్నారు.

ఇదంతా ఒక సినిమా ఫక్కీలో అతి ఆర్భాటంగా తప్పుడు లెక్కలతో శ్వేత పత్రాలు విడుదల చేయడం వెనుక కేవలం గత ప్రభుత్వాన్ని బదనాం చెయ్యాలన్నటువంటి యొక్క కపట నీతి తప్ప, తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి, ప్రజల అభివృద్ధికి పునాదులు వెయ్యాలని సంకల్పం మాత్రం ఉన్నట్లుగా లేదు. మీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 39% ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిందని దాసోజు శ్రవణ్‌కుమార్‌ అన్నారు.

అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ 37% ఓట్లతో ప్రతిపక్షంలో కూర్చుంది. ఎన్నికల సందర్భంలో AICC అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ, మరియు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ , కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య , డీకే శివకుమార్ మరియు మీతో సహా అనేక మంది అనేక వాగ్దానాలు చేశారు. యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, SC, ST డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ దానితో పాటు ఆరు గ్యారెంటీలు, మరియు విస్తృతమైన మేనిఫెస్టో, మార్పు అనే నినాదాలతో అందమైన కలను చూపిస్తూ మీరంతా ప్రచారం చేస్తే, మీ వాగ్దానాలను నమ్మి మీ పథకాలను చూసి, నచ్చి మెచ్చిన ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారని దాసోజు శ్రవణ్‌కుమార్‌ అన్నారు.

అధికారం కోల్పోయిన మొదటి రోజే B.R.S పార్టీ ప్రజలకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని విన్నవించింది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసేందుకు మా వంతు సహాయ సహాకారాలను అందిస్తామని, తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని మాత్రం ఇంకా ద్విగుణీకృతం చేసే విధంగా ఉండాలని ఒక ప్రతిపక్ష పార్టీగా కోరుకున్నారు. కానీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుండి బట్టకాల్చి మీద వేసే రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్నారు.

ఎన్నికల ముందు అన్ని స్థాయిలలో మీ నాయకులు తెలంగాణ 6 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని పదే పదే ప్రచారం చేశారన్నారు. అంటే తెలంగాణ అప్పుల సంగతి ముందే తెలుసు కదా, సరే అప్పుల చిట్టాను ప్రస్తావించిన మీరు, తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల చిట్టాను మాత్రం బయట పెట్టలేదన్నారు. కెసిఆర్ నేతృత్వంలో గత ప్రభుత్వం సంపద సృష్టించి, సంపద పెంచినటువంటి విషయాలను ప్రస్తావనకు తీసుకురాకుండా ఏకపక్ష శ్వేత పత్రాల పేరు మీద ప్రజలను మభ్యపెట్టేందుకు మసిపూసి మారేడుకాయను చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

దీనివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చే ఉపయోగం ఏంటో దయచేసి చెప్పండి. మీ శ్వేతపత్రాలలో ఉన్న అంశాలు అన్ని కూడా గత ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్లలో, సిఏజి ఆడిట్ రిపోర్టులలో ఉన్న అంశాలే, ప్రజలకు ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నవే. కొత్తగా మీరు ఏదో కనుక్కున్నట్లు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి అప్పుల లెక్క చెప్పడం కేవలం గత ప్రభుత్వంపై కక్ష సాధింపు ధోరణి కనిపిస్తుందన్నారు.

ALSO READ: అసెంబ్లీలో అక్బరుద్దీన్ వెర్సస్ రేవంత్ రెడ్డి..