Home   »  అంతర్జాతీయం   »   Japan Airlines: ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం.. రెండు విమానాలు ఢీ

Japan Airlines: ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం.. రెండు విమానాలు ఢీ

schedule ranjith

జపాన్‌ లోని టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. ప్రమాదం తరువాత జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో మంటలు చెలరేగాయి.

Japan Airlines: Serious accident at the airport.. Two planes collided

జపాన్ విమానాశ్రయం (Japan Airlines)లో ఘోర ప్రమాదం

జపాన్ విమానాశ్రయంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. టోక్యోలోని హనెడా విమానాశ్రయం రన్‌వేపై అనుకోకుండా ఓ విమానం మంటలు చెలరేగాయి. హక్కైడో నుంచి వస్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్ జేఏఎల్ 516 విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు వ్యాపించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానంలోని 379 మంది ప్రయాణికులు, సిబ్బందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

విమానం నుంచి పెద్దఎత్తున చెలరేగిన మంటలు

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా చక్రాల నుంచి మంటలు వెలువడుతున్నట్లు చూపిస్తుంది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

విమానం ఢీకొనడంతో సంభవించిన ప్రమాదం

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. అయితే ఎయిర్‌క్రాఫ్ట్‌ ల్యాండ్ అవుతుండగా కోస్ట్ గార్డ్ విమానం ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Warangal: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి