Home   »  వ్యాపారం   »   Today Stock Market: స్టాక్‌మార్కెట్ల భారీ పతనం..

Today Stock Market: స్టాక్‌మార్కెట్ల భారీ పతనం..

schedule ranjith
Today Stock Market: Huge fall in stock markets..

వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన Today Stock Market

దేశీయ స్టాక్‌మార్కెట్‌లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను వ్యాల్యూ స్టాక్‌లలో లాభాలను స్వీకరించడానికి ప్రేరేపించడంతో ఫ్రంట్‌లైన్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి.

బాంబే స్టాక్‌ ఎ‍క్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్ 536 పాయింట్లు, 0.75 శాతం నష్టంతో 71,356.60 వద్ద ముగిసింది. ఇక నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 148 పాయింట్లు, 0.69 శాతం క్షీణించి 21,517.35 వద్ద స్థిరపడింది.

బజాజ్‌ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా, ITC కంపెనీల షేర్లు మంచి లాభాలతో టాప్‌ గెయినర్స్‌ జాబితాలో చేరాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, LTI మైండ్‌ట్రీ, విప్రో, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలను చవిచూసి టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.

Also Read: Stock Market: లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన మార్కెట్లు