Home   »  జాతీయం   »   Bangladesh: బంగ్లాదేశ్‌లో విషాదం.. రైలులో చెలరేగి మంటలు.. 5గురు సజీవదహనం

Bangladesh: బంగ్లాదేశ్‌లో విషాదం.. రైలులో చెలరేగి మంటలు.. 5గురు సజీవదహనం

schedule ranjith

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోరం ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

Bangladesh: Tragedy in Bangladesh.. Fire broke out in a train.. 5 people were burnt alive.

Bangladesh రాజధాని ఢాకాలో విషాదకర ఘటన

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో విషాదకర ఘటన జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. జెస్సోర్ నుంచి రాజధాని ఢాకాకు చేరుకున్న బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. కనీసం నాలుగు కోచ్‌లకు మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారి రక్జీబుల్ హసన్ వెల్లడించారు. ఐదుగురు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని పోలీసు కమాండర్ అల్ మోయిన్ మీడియాకు తెలిపారు.

రైల్వే టెర్మినల్ గోపీబాగ్ వద్ద రైలులో మంటలు

ఢాకాలోని ప్రధాన రైల్వే టెర్మినల్ గోపీబాగ్ వద్ద రైలులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వందలాది మంది పరిగెత్తుకొచ్చి మంటల్లో కాలిపోతున్న ట్రైన్ నుంచి చాలా మంది ప్రయాణికులను బయటకు తీశారని తెలిపారు వెల్లడించారు. మంటలు చాలా త్వరగా వ్యాపించాయని వివరించారు. కాగా ఈ రైలులో కొందరు భారతీయులు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాల నిరసనలు

జాతీయ ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో కుట్రకోణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా నిప్పు పెట్టి ఉంటారా అనే కోణంలో సందేహిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదాన్ని విధ్వంస దాడిగా భావిస్తున్నామని పోలీసు చీఫ్ అన్వర్ హొస్సేన్ అన్నారు. గత నెలలో కూడా బంగ్లాదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. రైలులో మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

Also Read: Vaishali Express: మరో రైలు ప్రమాదం.. వైశాలి ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు