Home   »  జీవన శైలి   »   బరువు తగ్గాలంటే రోజూ నెయ్యి తినాల్సిందే!

బరువు తగ్గాలంటే రోజూ నెయ్యి తినాల్సిందే!

schedule sirisha

నెయ్యి (Ghee), నూనెలు మరియు పాల ఉత్పత్తులు తమ బరువును విపరీతంగా పెంచుతాయని చాలా మంది భయపడతారు. బరువు తగ్గాలనుకునే వారు తమ భోజనంలో నెయ్యికి దూరంగా ఉంటారు. అంతే కాదు స్వీట్లు, వంటకాలు నెయ్యితో చేస్తే పొరపాటున కూడా ముట్టరు.

You have to eat ghee every day to lose weight!

నెయ్యి (Ghee)ని వాడటం వల్ల బరువు తగ్గొచ్చు

నెయ్యి (Ghee) తింటే శరీర బరువు తగ్గుతుందని ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజంగా నిజం. నెయ్యిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయన్నది నిజమే అయినప్పటికీ, దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు. సాంప్రదాయ భారతీయ వంటకాలలో, భోజనంలో నెయ్యిని ఉపయోగించడం వల్ల అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

రోజూ 1 స్పూన్ నెయ్యి తింటే బరువు తగ్గుతారని డైటీషియన్లు అంటున్నారు. నెయ్యి తింటే లావు అవుతామని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి రెగ్యులర్ గా నెయ్యి తీసుకుంటే ఒంట్లోని కొవ్వును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

నెయ్యిలో పుష్కలంగా విటమిన్ A, E మరియు D లు

నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని శరీరానికి అందిస్తుంది. తద్వారా శరీర బరువును సక్రమంగా నిర్వహించుకోవచ్చు. నెయ్యిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇందులో విటమిన్ A, E మరియు D వంటి కొవ్వులో కరిగే విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం కాల్షియంను గ్రహించడంలో సహాయపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నెయ్యిలో క్యాలరీలు ఉన్నప్పటికీ బరువు తగ్గేందుకు దోహదపడుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. ఇందులో సంతృప్త కొవ్వు మరియు మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

దీర్ఘకాలిక థైరాయిడ్ సమస్యలు నయం

కాబట్టి నెయ్యి తింటే పొట్ట ఎక్కువ సేపు నిండినట్లు అనిపిస్తుంది. అతిగా తినే అలవాటు తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు. దీర్ఘకాలిక థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు నెయ్యి తినడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ మరియు అధిక బరువు రెండింటినీ నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలోని అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ పనితీరు మరియు జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు కూడా తగ్గుతారు.

కొబ్బరి, నువ్వుల నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎలా అయితే ఉంటాయె, అలాగే నెయ్యిలో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ ఉన్న నెయ్యి తినడం వల్ల క్యాన్సర్, గుండె సమస్యలు మరియు మధుమేహం నివారించవచ్చు. నెయ్యిలో ఉండే ‘కంజుగేటెడ్ లినోలిక్’ ఫ్యాటీ యాసిడ్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.

చలికాలంలో మంచి మాయిశ్చరైజర్‌గా నెయ్యి…

అంతేకాదు, చలికాలంలో నెయ్యి మంచి మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. పొడి చర్మం మరియు పగిలిన పెదాలతో బాధపడేవారు చర్మం మృదువుగా ఉండటానికి ప్రభావిత ప్రాంతాల్లో నెయ్యి రాస్తారు. అలాగే వాపులు, కాలిన గాయాలకు నెయ్యి ఔషధంగా పనిచేస్తుంది. నెయ్యిలో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్ నపుంసకత్వాన్ని తగ్గిస్తుంది. కీళ్ల మధ్య ఉండే మృదులాస్థిని రక్షిస్తుంది.

Also read: గుమ్మడికాయ గింజల నూనె ప్రయోజనాలు మీకు తెలుసా…