Home   »  రాజకీయం   »   జగన్‌ పాలనలో A.P 30 ఏళ్లు వెనక్కివెళ్ళింది: చంద్రబాబు

జగన్‌ పాలనలో A.P 30 ఏళ్లు వెనక్కివెళ్ళింది: చంద్రబాబు

schedule mounika

అసమర్థుని పాలనలో రాష్ట్రం కొంతవరకు నష్టపోయింది కానీ దుర్మార్గుడు పాలకుడైతే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Nara Chandrababu)పేర్కొన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితే అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు.

 NARA Chandrababu

ఈమేరకు తిరువూరులో జరుగుతున్న ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు.

“అరాచక పాలనకు చరమగీతం పాడాలి’’: Nara Chandrababu

‘జగన్‌ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కివెళ్ళిపోయింది. హైదరాబాద్‌ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయింది. ప్రజాస్వామ్యంలో నిద్రలేని కాలరాత్రులు గడిపామన్నారు. ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలి’’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ‘రా కదలిరా’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర రైతులు అప్పుల్లో అగ్రస్థానంలో ఉన్నారు: చంద్రబాబు

తెలుగుజాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ తోడ్పడిందని, తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుందని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారని, ధాన్యం రైతులు దగాపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతులు అప్పుల్లో అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో A.P రెండో స్థానంలో ఉందని విచారం వ్యక్తం చేసారు.

ALSO READ: A.P ని మా పార్టీ మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకొస్తుంది’ : చంద్రబాబు