Home   »  జాతీయం   »   Lakshadweep tourism | లక్షద్వీప్ టూరిజం పై టాటా గ్రూప్ కీలక నిర్ణయం

Lakshadweep tourism | లక్షద్వీప్ టూరిజం పై టాటా గ్రూప్ కీలక నిర్ణయం

schedule sirisha

Lakshadweep tourism | లక్షద్వీప్ ను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో టాటా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. టాటా గ్రూప్ రెండు రిసార్టులను 2026లోగా ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

Tata Group's key decision on Lakshadweep tourism

Lakshadweep tourism | లక్షద్వీప్ ను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో టాటా గ్రూప్ బిగ్ బూస్ట్ ఇచ్చే కీలక ప్రకటన చేసింది. లక్షద్వీప్ లోని సుహేలీ, కద్మత్ దీవులలో తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేయనున్నట్టు టాటా గ్రూప్ ఆతిథ్యరంగ అనుబంధ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ (IHCL) వెల్లడించింది.

ఈ రెండు రిసార్టులను 2026లో ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు తెలిపింది. బీచ్ ప్రేమికులు ముందుగా లక్షద్వీప్ కు రావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ ను సందర్శించిన నేపథ్యంలో ఇండియా- మాల్దీవుల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బాయ్‌కాట్ మాల్దీవులు ప్రచారం నేపథ్యంలో టాటా గ్రూప్ ప్రకటన లక్షద్వీప్ పర్యాటకానికి మరింత దోహదపడుతుంది.

Also read: ఇండియా – మాల్దీవుల బంధానికి బీటలు..!