Home   »  టెక్నాలజీ   »   చంద్రుడిపై సురక్షితంగా దిగిన మరో ల్యాండర్..!

చంద్రుడిపై సురక్షితంగా దిగిన మరో ల్యాండర్..!

schedule mahesh

Japan Moon Landing | చంద్రుడిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా దించిన ఐదవ దేశంగా జపాన్ రికార్డు సృష్టించింది. చంద్రుని పరిశోధన కోసం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగింది.

japan-|-another-lander-landed-safely-on-the-moon

చంద్రుడిపై అడుగుపెట్టిన ఐదో దేశంగా చరిత్ర సృష్టించిన Japan

జపాన్ శాస్త్రవేత్తలు పిన్‌పాయింట్ టెక్నాలజీని ఉపయోగించి భూ మధ్య రేఖకు దక్షిణంగా ఉన్న బిలం వాలుపై ల్యాండర్ ను ల్యాండ్ చేసారు. ఇప్పటివరకు అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, భారత్ మాత్రమే ఈ ఘనతను సాదించాయి. ఇటీవలే జాక్సా మిషన్ విజయవంతం కావడంతో చంద్రుడిపై అడుగుపెట్టిన ఐదో దేశంగా జపాన్ చరిత్ర సృష్టించింది.

Japanకు చెందిన “స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌” అనే ఈ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటల 50 నిమిషాలకు జాబిల్లి పైన ల్యాండ్ అయ్యింది. ఈ ప్రక్రియ నిర్దేశిత రీతిలో సాఫీగా సాగిందా అన్నదానిపై కొంత ఉత్కంఠ నెలకుంది. వ్యోమనౌకలోని లూనార్‌ ఎక్స్‌కర్షన్‌-1, 2 అనే రెండు రోవర్లు చందమామపై దిగాయని, వాటి నుండి డేటా భూమికి అందుతోందని జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు.

అయితే, ల్యాండర్‌లోని సోలార్ ప్యానెల్స్‌లో సమస్య తలెత్తి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్ల స్లిమ్ స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం బ్యాటరీలతో నడుస్తోందని భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజం, అసలు స్లిమ్ బ్యాటరీలతో పనిచేస్తుందా లేక సూర్యరశ్మిని గ్రహించి సోలార్ ప్యానెల్స్‌తో ఛార్జ్ చేస్తుందా అనే దానిపై జాక్సా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.

లక్ష్యానికి 100 మీటర్ల దూరంలో ల్యాండ్ అయిన ల్యాండర్

అయితే జాక్సా నిర్దేశించిన లక్ష్యానికి సరిగ్గా 100 మీటర్ల దూరంలో ల్యాండర్ ల్యాండ్ అయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రునిపై స్లిమ్ స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ప్రస్తుత పరిస్థితిని తనిఖీ చేస్తున్నట్లు JAXA తెలిపింది. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ వ్యవస్థను పరిశీలిస్తున్నామని జపాన్ అంతరిక్ష పరిశోధనకేంద్రం తెలిపింది. వ్యోమనౌక సౌర ఫలకాలను మినహాయించి, స్లిమ్ స్పేస్‌క్రాఫ్ట్‌లోని అన్ని ఇతర పరికరాలు బాగా పనిచేస్తున్నాయని JAXA అధికారి హితోషి కునినాకా వెల్లడించారు. అసలేం జరిగిందన్న పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.

Also Read | మళ్లీ పెళ్లి చేసుకున్న సానియా మీర్జా భర్త..?