Home   »  రాజకీయం   »   తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే: KCR

తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే: KCR

schedule mounika

తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ MPలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత KCR (Kalvakuntla Chandrashekar Rao) పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Kalvakuntla Chandrashekar Rao

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎర్రవెల్లి నివాసంలో జరిగింది. ఈ నెల చివరలో ప్రారంభమై వారం రోజుల పాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేసారు.

తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత బీఆర్ఎస్ MPలదే :Kalvakuntla Chandrashekar Rao

నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్ లో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర BRS పార్టీదేనన్నారు. కాగా నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ MPలదేనని స్పష్టం చేశారు.

దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో, పార్లమెంటు ఉభయ సభల్లో పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను, చర్చించాల్సిన విధానాలపై పార్టీ అధినేత KCR ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు K.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు సహా పార్టీ ఎంపీ లు పోతుగంటి రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, KR సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి మరియు వీరితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు పాల్గొన్నారు.

ALSO READ: మంత్రి కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి