YS Sharmila Sunita meeting | ఇడుపులపాయలో ఈరోజు APCC అధ్యక్షురాలు Y.S షర్మిలను ఆమె సోదరి, దివంగత Y.S వివేకానందరెడ్డి కుమార్తె సునీత కలిశారు. షర్మిల APCC బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరూ కలవడం ఇదే తొలిసారి.
YS Sharmila Sunita meeting | ఇడుపులపాయలో ఈరోజు APCC అధ్యక్షురాలు Y.S షర్మిలను ఆమె సోదరి, దివంగత Y.S వివేకానందరెడ్డి కుమార్తె సునీత కలిశారు. తాజాగా సునీత కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, వీరిద్దరూ రెండు గంటల పాటు పలు విషయాలపై చర్చించుకున్నారు. షర్మిల APCC బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరూ కలవడం ఇదే తొలిసారి.
మరోవైపు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఈ సమావేశానికి సునీత కూడా హాజరుకానున్నారు. షర్మిల పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి, సునీత కడప MP స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.
Also Read: YS Sharmila | రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం లేదు, ‘ప్రత్యేక హోదా’ లేదని మండిపడ్డ షర్మిల