Home   »  జీవన శైలి   »   5,141 కోట్ల వార్షిక బడ్జెట్‌కు TTD ఆమోద ముద్ర.!

5,141 కోట్ల వార్షిక బడ్జెట్‌కు TTD ఆమోద ముద్ర.!

schedule raju

TTD Annual Budget | నేడు TTD పాలకమండలి సమావేశం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంల అనంతరం, తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

5,141 crore TTD Annual Budget seal of approval

TTD Annual Budget | తిరుమల-ధర్మ ప్రచారంలో భాగంగా శివుని పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను బంగారు డాలర్ల రూపంలో భక్తులకు అందుబాటులో ఉంచుతామని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మహిళల కోసం మంగళసూత్రాలు, లక్ష్మిదేవి కాసులను తయారు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎలాంటి లాభం లేకుండా మంగళసూత్రాలు, లక్ష్మిదేవి కాసులను విక్రయిస్తామన్నారు.

TTD Annual Budget

నేడు TTD పాలకమండలి సమావేశం TTD చైర్మన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు అందించారు. 2024-25 సంవత్సరానికి రూ. 5,141 కోట్ల రూపాయల అంచనాతో TTD వార్షిక బడ్జెట్‌ కు ఆమోదం తెలిపామన్నారు.

ఉపాధ్యాయుల వేతనాలను పెంచిన TTD

TTD పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులను క్వాలిఫైడ్ వర్కర్లుగా గుర్తించి TTD పరిధిలోని 6 వేద పాఠశాలల్లో 51 మంది ఉపాధ్యాయుల వేతనాలను 35 వేల నుంచి 54 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సదుపాయం కార్మికులను నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు 30 కోట్లతో నాలుగు లైన్ల రోడ్ నిర్మాణానికి అనుమతి కోరారు.

నారాయణవనంలోని వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి 6.9 కోట్లు, స్విమ్స్ అభివృద్ధికి 148 కోట్లు, సప్తగిరి అతిథి గృహం అభివృద్ధి పనులకు 2.5 కోట్ల రూపాయలు కేటాయించినట్లు TTD తెలిపింది. SMC మరియు SSC కాటేజీల అలంకరణ కోసం 10 మిలియన్లను కేటాయించారు. అయితే వాటర్ వర్క్స్ తో పాటు అన్నప్రసాదం, TTD షాపుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వేతనాలు పెంచారు.

TTD ఉద్యోగులకు ఇళ్ల మంజూరు

వేద పండితుల పింఛన్లను 10 వేల నుంచి 12 వేలకు పెంచారు. TTD పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల వేతనాలు పెంచడంతో పాటు 56 వేద పండితుల పోస్టులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. TTD ఉద్యోగులకు ఇళ్ల మంజూరుకు సహకరించిన CM జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ TTD తీర్మానం చేసింది. TTD ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. “ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 57 మంది మఠాధిపతులు హాజరవుతారని, మానవతా చర్యలో భాగంగా TTD వారి సూచనలు, సలహాలను పరిశీలించి అమలు చేస్తుంది” అని తెలిపారు.

Also Read: TTD Anna Prasadam Trust: TTD అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11.11 లక్షల విరాళం.!